Harish Vs Revanth : హరీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం – రేవంత్ రెడ్డి

మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తు వస్తుందంటూ రేవంత్ సెటైర్ వేశారు

  • Written By:
  • Publish Date - April 26, 2024 / 01:14 PM IST

తెలంగాణ లో లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) ప్రచారం కాక రేపుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ – బిఆర్ఎస్ (Congress – BRS) నేతల మధ్య సవాళ్లు – ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. తాజాగా మెదక్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు (Harish Rao)..సీఎం రేవంత్ (CM Revanth Reddy) కు సవాల్ విసిరారు. ఆగష్టు 15 లోపు రుణమాఫీ చేయడం నిజమైతే, ఆరు హామీలు అమలు చేయడం నిజం అయితే అమరవీరుల స్థూపం వద్దకు రా.. రాజీనామా లేఖలను ఇద్దరం మేధావుల చేతిలో పెడదామని చెప్పిన హరీష్..ఈరోజు అమరవీరుల స్థూపం వద్దకు తన రాజీనామా లేఖతో వచ్చి ఛాలెంజ్ విసిరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో హరీష్ రావు ఛాలెంజ్ కి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తు వస్తుందంటూ రేవంత్ సెటైర్ వేశారు. హరీష్ రావు మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా..? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు…రాజీనామా లేఖ అలా ఉండదు..హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు. స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు అని హరీష్ రావు తన తెలివి ప్రదర్శిస్తున్నారు అంటూ రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసారు. హరీశ్ రావు సవాల్ ను స్వీకరిస్తున్నా.. ఆగస్టు 15 లోపు రూ. 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతాం.. హరీశ్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకో అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతులకు రుణమాఫీ చేయకపోతే మేమే అధికారంలో ఉండము అంటూ కామెంట్స్ చేశారు రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ తో శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పార్టీ బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తప్పుడు వార్తలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టాలన్నారు. సెమీ ఫైనల్ మ్యాచ్ లో బీఆర్ఎస్ పై గెలిచాం.. ఇక ఫైనల్ మ్యాచ్ లో బీజేపీపై గెలవాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాల్లో గెలవాలన్నారు. గెలుపు దిశగా అడుగులు వేయాలని సూచించారు.

Read Also : England Cricketer: మాంచెస్టర్‌లో చిక్కుకున్న ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్‌.. కార‌ణ‌మిదే..?