సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy )..కేసీఆర్ (KCR) ను ఎక్కడ వదిలిపెట్టడం లేదు..పబ్లిక్ మీటింగ్ అయినా…ప్రభుత్వ కార్యక్రమం అయినా సభ ఏదైనా సవాళ్లు మాత్రం కామన్ అన్నట్లు రేవంత్ దూకుడు కనపరుస్తున్నారు. తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభిస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన రేవంత్..నేడు ఇచ్చిన మాట ప్రకారం భద్రాచలం లో ఈ పథకానికి శ్రీకారం చుట్టి ప్రజల్లో మరింత నమ్మకం కూడగట్టుకున్నారు. ఇప్పటికే ఆరు గ్యారెంటీ హామీల్లో మహిళలకు ఫ్రీ బస్సు , ఆరోగ్య శ్రీ పెంపు , 200 యూనిట్లో లోపు ఫ్రీ కరెంట్ , రూ.500 లకే గ్యాస్ సిలిండర్ వంటి హామీలను నెరవేర్చిన రేవంత్..ఈరోజు ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని కూడా ప్రారంభించారు.
We’re now on WhatsApp. Click to Join.
సోమవారం భద్రాచలంలో ప్రతిష్టాత్మక ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని (Indiramma Housing Scheme) ఆయన ప్రారంభించారు. ముందుగా భద్రాచలం స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్న రేవంత్..ఆ తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పథకాన్నిప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సీఎం రేవంత్..మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సవాల్ విసిరారు. ‘డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చి దళితులను ఆదుకున్నా అని చెబుతున్నావ్ కదా KCR. ఏ ఊర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చావో అక్కడ నువ్వు ఓట్లు వేయించుకోవాలి. ఏ ఊర్లో ఇందిరమ్మ ఇళ్లు ఉన్నాయో అక్కడ మేం ఓట్లు వేయించుకుంటాం. ఈ సవాలు కు KCR సిద్ధమా?’ అని రేవంత్ ప్రశ్నించారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో బీఆర్ఎస్ పదేళ్లు మోసం చేసిందని, పేదల కలల మీద కేసీఆర్ ఓట్ల వ్యాపారం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా ధ్వజమెత్తారు. తమ పాలనలో అర్హులైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని, ఇళ్లు ఉన్న చోట కాంగ్రెస్‌కు ఓటు వేయాలని సీఎం కోరారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(PM Awas Yojana) కింద పేదలకు ఇళ్లు కట్టిస్తామని ప్రధాని చెప్పారన్న ఆయన, ఆ పథకం ద్వారా తెలంగాణలో ఎక్కడ ఇళ్లు కట్టారో బీజేపీ చెప్పాలని డిమాండ్ చేశారు. మద్దతు ధర కోసం పోరాడుతున్న రైతులపై తుపాకీలు ఎక్కుపెడుతున్నారని విమర్శించారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పిన ప్రధాని, భర్తీలే కానీ పూరించివుంటే ఇప్పుడు నిరుద్యోగ సమస్య ఉండదు కదా అని ప్రశ్నించారు.
Read Also : Bhatti Vikramarka : గత ప్రభుత్వాలు కట్టిన ఇళ్లకు కూడా పట్టాలు ఇస్తాం – భట్టి