Site icon HashtagU Telugu

Runa Mafi : ఒకేసారి రుణమాఫీ ..సీఎం రేవంత్ కీలక ప్రకటన

Runamafi Revanth

Runamafi Revanth

రుణమాఫీ (Runa Mafi) ఫై సీఎం రేవంత్ (CM Revanth Reddy) కీలక ప్రకటన చేసారు.మొన్నటి వరకు రుణమాఫీ ఫై అనేక రకాలుగా ప్రచారం అవుతుండడం తో పలువురి రైతుల్లో ఆందోళన పెరిగింది. జులై మొదటి వారం నుంచే దశల వారీగా రుణమాఫీ అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉందని..రుణ మాఫీలో భాగంగా మొదటగా రూ.లక్ష వరకు ఉన్న రుణాన్ని మాఫీ చేస్తారని.. తర్వాత రూ.లక్షన్నర..ఆ తర్వాత రూ.2 లక్షల వరకు ఉన్న వారికి రెండు దశల్లో అమలు చేయనున్నారని ప్రచారం జరగడం తో రైతులు కాస్త ఆందోళన చెందారు. కానీ ఈరోజు ఒకేసారి రైతులందరికీ రుణమాఫీ చేస్తామని ప్రకటించడం తో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

శుక్రవారం సాయంత్రం తెలంగాణ కేబినెట్‌ భేటీ సచివాలయంలో జరిగింది. వ్యవసాయం, రైతు సంక్షేమం ఎజెండాగా కేబినెట్‌లో ప్రధానంగా చర్చ జరిపారు. ఈ సందర్భాంగా రుణమాఫీపై కేబినెట్‌లో కీలక నిర్ణయం తీసుకుంది. 2023 డిసెంబర్‌ 9 నాటికి తీసుకున్న రూ.2 లక్షల పంట రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. అలాగే ఈ రుణమాఫీ అమలుకు సంబంధించిన విధివిధానాలు రూపొందించేందుకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ కేబినెట్ సబ్ కమిటీ పని చేస్తుందని తెలిపారు. ఈ కమిటీలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు సభ్యులుగా ఉంటారని పేర్కొన్నారు. రైతు సంఘాలు, రాజకీయ పార్టీలతో పాటు వివిధ వర్గాల సూచనలతో కేబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా స్కీమ్ గైడ్ లైన్స్ ఖరారు చేస్తోందని ,ప్రజల నుండి కూడా సలహాలు స్వీకరిస్తామని తెలిపారు.

Read Also : Rush : చాన్నాళ్లకు ‘రష్’ అంటూ వచ్చిన రవిబాబు.. ఓటీటీలో దూసుకుపోతున్న రవిబాబు సినిమా..