Site icon HashtagU Telugu

CM Revanth : రేవంత్ చేసిన ఆ ఒక్క ట్వీట్ అభ్యర్థుల ఆగ్రహాన్ని చల్లారేలా చేసింది..

CM Revanth Reddy press meet

CM Revanth Reddy press meet

గ్రూప్‌-1 పరీక్ష (Group 1 Exam) రీ షెడ్యూల్‌ చేయాలని కొంతమంది అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. వీరికి మద్దతుగా ప్రతిపక్ష పార్టీలు సైతం కాలుమోపినప్పటికీ..ప్రభుత్వం మాత్రం ఎక్కడ తగ్గలేదు. చెప్పినట్లే ఈరోజు పరీక్షలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy Tweet) బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ చేసిన ట్వీట్ వారిలోని ఆగ్రహాన్ని చల్లారేలా చేసింది. ఎటువంటి ఆందోళన చెందకుండా పూర్తి ఏకాగ్రతతో పరీక్షలు రాయాలని, ఈ పరీక్షల్లో విజయం సాధించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని అభ్యర్థులను కోరారు. మరికొద్ది గంటల్లో పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు.. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లైంది. దీనితో పరీక్షలు కూడా ప్రారంభం కాగా.. అభ్యర్థులకు బెస్ట్ ఆఫ్ లక్ చెబుతూ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇక గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన 31,383 మంది అభ్యర్థులు మెయిన్స్ ప‌రీక్ష‌లు రాయ‌నున్నారు. ప‌రీక్ష హాలులోకి ఎంట‌ర్ అయ్యే అభ్యర్థులను డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాకే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు. అభ్య‌ర్థులు నిబంధనలను (Group 1 Candidates Rules) తప్పనిసరిగా పాటించాలి.అభ్యర్థులు బ్లాక్ లేదా బ్లూ క‌ల‌ర్ బాల్ పాయింట్ పెన్, పెన్సిల్, రబ్బర్, హాల్ టికెట్, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా కార్డును ప‌రీక్షా హాల్‌లోకి తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఎలాంటి జెల్, స్కెచ్ పెన్స్ ఉపయోగించ‌కూడ‌దు. హాల్ టికెట్‌పై అభ్యర్థితో పాటు ఇన్విజలేటర్ సంతకం త‌ప్ప‌నిస‌రి. ఆన్స‌ర్ రాసేందుకు బుక్ లెట్ ఇస్తారు. అడిషనల్స్ ఇవ్వరు.

Read Also : Hindutva : ‘సోషలిస్ట్‌’, ‘సెక్యులర్‌’ పదాలను తొలగించాలా ? పిటిషనర్లపై ‘సుప్రీం’ ఆగ్రహం