Site icon HashtagU Telugu

Congress:వరి రైతుల కోసం ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ దీక్ష

Revanth reddy

కేంద్రం వెనక్కి తీసుకున్న మూడు రైతు చట్టాలను అంబానీ, అదానీల కోసం కేసీఆర్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దానిలో భాగంగానే ఇకపై కొనుగోలు సెంటర్లు ఉండవని కేసీఆర్ ప్రకటించారని రేవంత్ తెలిపారు.

బీజేపీ, టీఆర్ఎస్ రైతులను తమ మాటలతో మభ్యపెడుతున్నాయని, తెలంగాణ రైతుల కోసం ఢిల్లీలో నిరసన సభ నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లో నిరసనలు చేస్తున్నట్లు నటిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ కు రైతులపై చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలోని జంతరమంతర్ దగ్గర ధర్నా చేయాలని సవాల్ విసిరారు.

ఎఫ్సీఐ సేకరించిన ధాన్యం ప్రభుత్వ గోడౌన్ల నుంచి మాయమైందని దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేయడానికి కేంద్ర మంత్రిని కలుద్దామనుకుంటే అపాయింట్మెంట్ ఇవ్వట్లేదని, కానీ టీఆర్ఎస్ నాయకులకు పలుమార్లు పీయూష్ గోయల్ అపాయింట్మెంట్ ఇచ్చారని రేవంత్ విమర్శించారు. రైతుల విషయంలో టీఆర్ఎస్ బీజేపీ దొంగనాటకాలు ఆడుతున్నాయని రేవంత్ ఆరోపించారు.

 

 

Exit mobile version