Telangana: లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లో విశ్రాంతి తీసుకోకుండా లోక్‌సభ ఎన్నికల కోసం రెండు పార్టీల మధ్య ‘రహస్య ఒప్పందం’ కుదుర్చుకోవడం కోసం ప్రధాని నరేంద్ర మోడీతో ‘రహస్య చర్చలు’ జరుపుతున్నారని ఆయన ఆరోపించారు.
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, హరీశ్‌రావులు ప్రతిరోజూ కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్న తీరు అనుమానాలకు దారి తీస్తుందని సీఎం చెప్పారు. గులాబీ నాయకులు బీజేపీని విమర్శించడం లేదని చెప్పారు. బీఆర్‌ఎస్-బీజేపీ మధ్య కుదిరిన డీల్‌కు ఇదే నిదర్శనమని రేవంత్‌రెడ్డి అన్నారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం కేంద్రం ఇచ్చిన హామీలన్నీ తెలంగాణ రాష్ట్రం సాధించాలంటే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలోని మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ చనిపోయిందని, ఉనికిలో లేదని పేర్కొంటూ తమ ఓట్లను వృథా చేయవద్దని ప్రజలను కోరారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లే అని ముఖ్యమంత్రి అన్నారు. తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చమని కేసీఆర్‌గానీ, గత పదేళ్లలో మోదీ ఈ హామీల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తెలంగాణను విస్మరించి తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలపైనే దృష్టిసారించారని రేవంత్‌రెడ్డి అన్నారు. .
అందరికీ ఇళ్లు, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం, స్విస్‌బ్యాంక్‌లోని నల్లధనాన్ని వెనక్కి తెప్పించడం, ప్రతి భారతీయుడి ఖాతాల్లో రూ.15 లక్షలు జమ చేయడం వంటి ప్రధాన ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారని ముఖ్యమంత్రి ఆరోపించారు. అత్యధిక రైతు ఆత్మహత్యలు జరుగుతున్న దేశంగా భారత్‌ను తీర్చిదిద్దడంలో మోదీ సందేహాస్పదమైన ఘనత సాధించారని రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read: Jubilee Hills Car Accident : జూబ్లీహిల్స్ లో కారు బీభత్సం..