తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మరోసారి ఢిల్లీ (Delhi) బాట పడుతున్నారు. ఈరోజు ఢిల్లీలో ఆయన ఏఐసీసీ నాయకులతో (AICC Leaders) సమావేశం కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు , అభివృద్ధి , కులగణన సర్వే తదితర అంశాలను చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. అలాగే త్వరలో రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో రేవంత్ ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ నాయకుల్లో ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటు జరిగి దాదాపు ఏడాది దగ్గరికి వస్తున్నప్పటికీ ఇంత వరకు క్యాబినెట్ విస్తరణ (Cabinet expansion) జరగలేదు. కీలక మంత్రుల స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. దీంతో సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారి క్యాబినెట్ విస్తరణ జరుగుతుందని అంత భావిస్తున్నారు కానీ అది జరగడం లేదు. మరి ఈసారైనా క్యాబినెట్ విస్తరణ జరుగుతుందా అని అంత మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే కొత్త మంత్రుల జాబితా ఢిల్లీ పెద్దల వద్దకు చేరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలో దీనిపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి ఏంజరుగుతుందా అనేది. ఢిల్లీలో ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ‘అడ్డా’ ప్రోగ్రాంలో రేవంత్ పాల్గొననున్నారు. ఉదయం 10 గంటలకు హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరతారు. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు అడ్డా ప్రోగ్రాంలో ఆయన పాల్గొంటారు.
ఇదిలా ఉంటె నిన్న సాయంత్రం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ సైతం ఢిల్లీకి వెళ్లడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రులకు కేటీఆర్ పిర్యాదు చేయబోతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్‌పై కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ ఫిర్యాదు చేశారు. అమృత్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ కంప్లైట్ ఇచ్చారు. సీఎం రేవంత్ బావమరిది సృజన్ రెడ్డి కంపెనీకి అర్హత లేకున్నా టెండర్లు కట్టబెట్టారని.. అమృత్ 2.O ప్రాజెక్ట్‌లో తెలంగాణకు కేటాయించిన 8వేల 888 కోట్ల పనులపై విచారణ జరిపించాలని కేంద్రమంత్రిని కోరడం జరిగింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఖట్టర్‌కు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మరి ఈ ఫిర్యాదుల నేపథ్యంలో కేంద్రం ఏంచేయబోతుందో అనేది చూడాలి.
Read Also : Gopi Mohan : డైరెక్టర్ గా మారుతున్న స్టార్ రైటర్.. మహేష్ మేనల్లుడు హీరోగా సినిమా..