Telangana Congress: ఎంపీ పదవులకు రేవంత్, కోమటిరెడ్డి రాజీనామా?

రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఎంపీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Telangana Congress

Telangana Congress

Telangana Congress: రాహుల్ గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ ఎంపీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఢిల్లీ ఏఐసీసీ ఇచ్చే ఆదేశం కోసం రాష్ట్ర శాఖలు వేచిచూస్తున్నాయి. ఆ మేరకు రాజీనామా  చేయడానికి సిద్ధంగా ఉన్నామని రేవంత్, కోమటిరెడ్డి వెల్లడించారు. రాబోవు రోజుల్లో చేపట్టాల్సిన ఆందోళనపై కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఎంపీలు రాజీనామా చేయాలనే అంశంపై చర్చ జరుగుతోందని, ఈ విషయంలో ఏఐసీసీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటామన్నారు. పార్టీ ఆదేశిస్తే అందరం రాజీనామా చేస్తామని తెలిపారు.

రాహుల్ అనర్హత ను నిరసిస్తూ ఆందోళనలో పాల్గొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం మాట్లాడారు. ‘రాహుల్ పై అనర్హత వేటు నిర్ణయం కంటతడి పెట్టించిందన్నారు. ప్రధాని అయ్యే అవకాశం వచ్చినా రాహుల్ వదులుకున్నారని తెలిపారు.అదానీ గురించి మాట్లాడినందుకే రాహుల్ పై కుట్ర చేశారని.. పార్లమెంట్ లో ప్రశ్నిస్తారనే భయం బీజేపీలో పెరిగింది. ఆగమేఘాల మీద పరువునష్టం కేసులో శిక్ష పడేలా చేశారు. అవసరమైతే కాంగ్రెస్ ఎంపీలందరూ రాజీనామా చేయాలని.. రాహుల్ పై అనర్హత వేటు ఎత్తివేసే వరకూ పోరాడుతామని నేతలు ప్రకటించారు.
ఇందిరాగాంధీపై వేటు వేస్తే ఏం జరిగిందో ఇప్పుడు అదే జరుగుతుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డితోపాటు మాణిక్ రావు ఠాక్రే ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నాల వీహెచ్ సహా కాంగ్రెస్ నేతలంతా పాల్గొనడం విశేషం.

ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ‘రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం లేకనే అనర్హత వేటు వేశారని’ ఆరోపించారు. దేశ స్వాతంత్ర్యం కోసం రాహుల్ తాత నెహ్రూ జైలుకు వెళ్లారన్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం రద్దును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్పార్టీ ఆందోళనలు చేపట్టింది. ‘సంకల్ప్ సత్యాగ్రహ’ పేరుతో హైదరాబాద్ లెోని గాంధీభవన్ లోనూ కాంగ్రెస్ నేతలు దీక్ష చేపట్టారు. రాహుల్ గొంతును అణచివేసి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలని బీజేపీ మోడీ చూస్తున్నారని.. అలాంటి కుట్రలను తిప్పి కొడుతామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

  Last Updated: 26 Mar 2023, 07:40 PM IST