Site icon HashtagU Telugu

CM Revanth: మైనార్టీలకు రేవంత్ ఇఫ్తార్ విందు.. ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లు

Cm Revanth Reddy Will Go To

Cm Revanth Reddy Will Go To

CM Revanth: తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి మార్చి 15, శుక్రవారం ఫతే మైదాన్‌లోని ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందును నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో నాత్-ఎ-షరీఫ్, ఖిరాత్ సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభమవుతాయి. ఇఫ్తార్ సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమవుతుందని సంబంధిత అధికారులు పత్రికా ప్రకటనలో తెలిపారు. “వేదిక వద్ద నమాజ్ కోసం ఏర్పాట్లు చేయబడ్డాయి

సకాలంలో వేదిక వద్దకు చేరుకోవాలని ఆహ్వానితులను కూడా కోరారు అధికారులు. అయితే ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ పార్టీ  నిర్వహిస్తుంది. అయితే మొదట మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు, BRS పాలనలో ఏటా నిర్వహించే సంప్రదాయం మొదలైంది.

కాగా ఇటీవలనే సీఎం రేవంత్ పాతబస్తీవాసుల కలను నిజం చేశారు. త్వరలో పాతబస్తీలో మెట్రో రైలు పరుగులు పెట్టబోతోంది. దీనికి ముహూర్తాన్ని కూడా ఖరారు చేసింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. రూట్ మ్యాప్ సైతం సిద్ధం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్‌స్టేషన్- మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్ నిర్మితమైంది. రోజూ వేలాదిమంది ప్రయాణికులు మెట్రో రైలు సేవలను వినియోగించుకుంటోన్నారు.