Site icon HashtagU Telugu

Formula E Race Case : ఈ ఫార్ములా రేస్ పై రేవంత్ గోబెల్స్ ప్రచారం – హరీశ్ రావు

Harish Rao

Harish Rao

ఫార్ములా ఈ కార్ రేసింగ్ (Formula E Race Case) వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)కు హైకోర్టు నుండి తాత్కాలిక ఊరట లభించడంతో బిఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తుంటే..కాంగ్రెస్ శ్రేణులు మాత్రం కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్ర‌భుత్వం పెట్టిన కేసు డొల్ల కేసు అని తొలి అడుగులోనే తేలిపోయింద‌ని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు.

రేవంత్ రెడ్డి అక్ర‌మంగా బ‌నాయించిన కేసును ప్రాథ‌మికంగా ప‌రిశీలించిన‌ హైకోర్టు.. అరెస్టు చేయొద్ద‌ని ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం ప‌ట్ల‌ హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాను. ఈ కేసులో తొలి అడుగులోనే కేటీఆర్ నైతిక విజ‌యం సాధించారు. కేటీఆర్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేస్తున్నా. ఇది డొల్ల కేసు అని మొద‌టి అడుగులోనే స్ప‌ష్ట‌మైంద‌ని హ‌రీశ్‌రావు మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.

ఫార్ములా-ఈ కార్ రేసు కేసు (Formula E Car Race Case) వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యహారంలో మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ను అరెస్ట్ చేయబోతున్నారని..జైల్లో వేస్తారని..కొన్ని నెలల పాటు ఆయన జైల్లోనే ఉంటారని , కనీసం బెయిల్ కూడా రాదని ఇలా ఎవరికీ వారు ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసు పై ఈరోజు హైకోర్టు లో విచారణ జరిగింది. కేటీఆర్ తరుపు లాయర్ , ప్రభుత్వం తరుపు లాయర్ ఇరువురు తమ వాదనలు వినిపించారు. కోర్ట్ మాత్రం డిసెంబర్ 30 వరకు కేటీఆర్‌ను అరెస్టు చేయరాదని ఏసీబీకి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ దర్యాప్తు కొనసాగించవచ్చని, ఈ నెల 30లోపు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.

Read Also : Formula E Car Race Case : అధికారం ఉందని అరెస్ట్ చేస్తే ఎలా..? – జేడీ