Site icon HashtagU Telugu

KTR: కేటీఆర్ ని నిలదీసిన మహిళ రైతు

KTR

KTR

KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యేకేటీఆర్ కు ఓ మహిళ షాక్ ఇచ్చింది. నా భూమీ నాకివ్వాలని నిలదీసింది. అయితే నీ భూమి నీకు వచ్చేలా చూస్తానని కేటీఆర్ చెప్పినప్పటికీ మహిళ వినిపించుకోలేదు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మే 13న రాష్ట్రంలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల రాజకీయ ప్రచారంలో భాగంగా స్థానికులతో కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బిఆర్ఎస్ పాలనలో బి.లక్ష్మి అనే మహిళ రైతు భూమిని వైద్య కళాశాల కోసం సేకరించినట్లు సమాచారం. ఎమ్మెల్యేతో కరచాలనం చేసిన లక్ష్మి.. తాను 2 ఎకరాల భూమిని కోల్పోయానని, దీనిపై కలెక్టర్‌తో మాట్లాడి తన భూమిని తిరిగి ఇప్పిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు.తనకు భూమి లేక ఇబ్బంది పడుతున్నానని లక్ష్మీ కేటీఆర్‌కు తెలిపారు.

Also Read: NTR : ఎన్టీఆర్ బర్త్ డేకి.. ఈ అప్డేట్స్ రాబోతున్నాయట.. సాంగ్, గ్లింప్స్, పోస్టర్..!

Exit mobile version