TS SSC Exam 2024:10వ తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్లపై కఠిన ఆంక్షలు

10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ సెల్ ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది.

Published By: HashtagU Telugu Desk
TS SSC Exam 2024

TS SSC Exam 2024

TS SSC Exam 2024: 10వ తరగతి పరీక్షలకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యాశాఖ సెల్ ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు విధించింది.

పరీక్ష సిబ్బంది, స్క్వాడ్‌లు సహా ఎవరూ సెల్‌ఫోన్‌లు వినియోగించరాదని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే సస్పెండ్ చేయడంతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ హెచ్చరించింది. గతేడాది జరిగిన ఘటనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ తెలిపింది.

తెలంగాణ 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ప్రారంభం కానున్నాయి, దీనికి సంబంధించిన హాల్ టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయి మరియు వెబ్‌సైట్ నుండి హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 2,676 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Also Read: Harish Rao: రేవంత్ కు హరీశ్ రావు బహిరంగ లేఖ.. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయంచేయాలంటూ!

  Last Updated: 12 Mar 2024, 05:18 PM IST