Republic day : తెలంగాణ రిప‌బ్లిక్ `ఢీ`! పేరెడ్ తో వేడుక‌ల‌కు హైకోర్టు ఆదేశం!

గ‌ణ‌తంత్ర్య దినోత్సవం(Republic day) సంద‌ర్భంగా గత రెండేళ్లుగా

  • Written By:
  • Updated On - January 25, 2023 / 05:20 PM IST

గ‌ణ‌తంత్ర్య దినోత్సవం(Republic day) సంద‌ర్భంగా గత రెండేళ్లుగా రాజ్ భ‌వ‌న్, సీఎంవో మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని జ‌నాల్లోకి వెళుతోంది. రాజ్యాంగం అమ‌లులోకి వ‌చ్చిన రోజును ఘ‌నంగా జ‌రుపుకోవాల్సిన రాష్ట్ర ప్ర‌భుత్వం గ‌వ‌ర్న‌ర్ ను ప‌క్క‌న పెట్టేస్తోంది. రాజ్ భ‌వ‌న్ వేదిక‌గా త‌మిళ సై వేడుక‌ల‌ను(Celebrations) జ‌రుపుతున్నారు. ప్ర‌గ‌తిభ‌వ‌న్ వేదిక‌గా కేసీఆర్ వేడుకల‌ను జ‌రుపుకుంటూ రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేస్తున్నారు. గ‌తంలో జూబ్లీహాల్ వేదిక‌గా ఘ‌నంగా రిప‌బ్లిక్ డే వేడుకల‌ను నిర్వ‌హించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలోనూ, విడిపోయిన త‌రువాత కూడా ఘ‌నంగా జూబ్లీ గార్డెన్స్ వేదిక‌గా వేడుక‌లు జ‌రిగేవి.

గ‌ణ‌తంత్ర్య దినోత్సవం(Republic day)

రెండేళ్లుగా త‌మిళ సై, కేసీఆర్ మ‌ధ్య గ్యాప్ పెరుగుతోంది. అసెంబ్లీ స‌మావేశాల సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ప్ర‌సంగం లేకుండా స‌భ‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు. గ‌త రెండు సెష‌న్స్ అలాగే జ‌రిగాయి. కొన్ని బిల్లును అసెంబ్లీ ఆమోదించిన‌ప్ప‌టికీ రాజ్ భ‌వ‌న్ వ‌ద్ద పెండింగ్ లో ఉన్నాయి. రాష్ట్ర ప్ర‌భుత్వం మీద త‌మిళ సై నేరుగా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ప్రోటోకాల్ పాటించ‌డంలేద‌ని ప‌లు వేదిక‌ల మీద ఆమె చెప్పారు. స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ జాత‌ర‌కు వెళ్ల‌డానికి హెలికాప్ట‌ర్ ను సీఎంవో ఆఫీస్ స‌మ‌కూర్చ‌లేదు. భ‌ద్రాద్రి వెళ్ల‌డానికి ప్రోటో కాల్ ప్రకారం గ‌వ‌ర్న‌ర్ కు(Republic day) ఏర్పాట్లు చేయ‌లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే, ప‌లు సంద‌ర్భాల్లో ప్ర‌భుత్వానికి, రాజ్ భ‌వ‌న్ కు మ‌ధ్య గ్యాప్ పెరిగింద‌న‌డానికి బోల‌డ‌న్న ఉదాహ‌ర‌ణ‌లు.

Also Read : CM Vs Governor: ప్రగతిభవన్ Vs రాజ్ భవన్.. ఏం జరుగుతోంది!

తాజాగా గ‌వ‌ర్న‌ర్ ను మార్చుతార‌ని కూడా టాక్ వ‌చ్చింది. ప్ర‌భుత్వం పెడుతోన్న అవ‌మానాన్ని త‌ట్టుకోలేక త‌మిళ సై బ‌దిలీకి రిక్వెస్ట్ పెట్టార‌ని ప్ర‌గ‌తిభ‌వ‌న్ వేదిక‌గా చ‌ర్చ న‌డిచింది. ఇవ‌న్నీ ఒక ఎత్తైతే, రిప‌బ్లిక్ డే వేడుక‌ల‌ను(Celebrations) పేరేడ్ గ్రౌండ్లో ఘ‌నంగా గ‌తంలో జరిపే వాళ్లు. ఆ త‌రువాత ప‌బ్లిక్ గార్డెన్ వేదిక‌గా స్వాతంత్ర్య దినోత్స‌వాల‌ను జ‌రుపుకునే ఆన‌వాయితీ ఉండేది. వీటికి చెక్ పెడుతూ గ‌త రెండేళ్లుగా స్వాతంత్ర్య సంబ‌రాల‌ను వేర్వేరుగా కేసీఆర్, త‌మిళ సై నిర్వ‌హించుకుంటున్నారు. రాజ్ భ‌వ‌న్ వేదిక‌గా జ‌రిగే వేడుక‌ల‌కు మంత్రులు కూడా దూరంగా ఉంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితిపై హైకోర్టులో పిల్ ప‌డింది. దానిపై విచార‌ణ చేసిన కోర్టు సీరియ‌స్ గా ప్ర‌భుత్వానికి కొన్ని మార్గ‌ద‌ర్శ‌కాల‌ను తెలియ‌చేస్తూ ఉత్త‌ర్వులు ఇచ్చింది.

గణతంత్ర వేడుకలను నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ

జ‌న‌వ‌రి 26 రోజున భారతదేశం గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోబోతోంది. మరోవైపు, ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఏ మాత్రం స్పందించలేదు. వేడుకలను నిర్వహిస్తున్నారా? లేదా? అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. గణతంత్ర వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలంటూ మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. పరేడ్ తో కూడిన వేడుకలను నిర్వహించాలని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.

Also Read : Tamilisai Vs KCR : మ‌ళ్లీ `రాజ‌భ‌వ‌న్` రాజ‌కీయ ర‌చ్చ‌