Renuka Chowdhury : కాంగ్రెస్ టికెట్ల కేటాయింపుపై రేణుక తీవ్ర అసంతృప్తి

కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఫై మాజీ మంత్రి రేణుక అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు

  • Written By:
  • Publish Date - October 27, 2023 / 02:26 PM IST

మరికాసేపట్లో కాంగ్రెస్ ..సెకండ్ లిస్ట్ (Congress Second List) ను విడుదల చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ల (Congress Tickets) కేటాయింపుపై మాజీ మంత్రి రేణుకా చౌదరి (Renuka Chowdhury) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ఇప్పుడు చర్చ కు దారితీస్తుంది. మరో 33 రోజుల్లో తెలంగాణ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో తామంటే తాము గెలుస్తామని కాంగ్రెస్ , బిఆర్ఎస్ , బిజెపి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కానీ ఈసారి ప్రధానంగా కాంగ్రెస్ – బిఆర్ఎస్ మద్యే ఉండబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. రెండుసార్లు బిఆర్ఎస్ పాలనా చూసిన ప్రజలు ఈసారి మార్పు కోరుతున్నారని..కాంగ్రెస్ పార్టీ కి ఓ ఛాన్స్ ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నట్లు పలు సర్వేలు చెపుతున్నాయి. ఇదే క్రమంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ లోకి వలసలు చేరుతుండడం తో కార్యకర్తల్లో నమ్మకం పెరుగుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె కాంగ్రెస్ టికెట్ల కేటాయింపు ఫై మాజీ మంత్రి రేణుక అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాజిక న్యాయం జరగలేదని, బయట నుంచి వచ్చిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆమె ఆరోపించారు. డబ్బున్న వాళ్లకు కాదు, దమ్మున్నవారికి టికెట్లు ఇవ్వాలని రేణుకా చౌదరి అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్మలకు తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని..కమ్మ కులాన్ని కూడా గుర్తించాలని రేణుకా చౌదరి డిమాండ్ చేశారు. ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పరిణామాల కారణంగా కమ్మ కులస్తులు ఉద్రేకంగా ఉన్నారన్నారు. కమ్మ కులస్తుల మనోభావాల్ని పరిగణలో తీసుకోవాలని అధిష్టానాన్ని కోరినట్లు రేణుక చెప్పుకొచ్చారు. కమ్మలకు టికెట్లు ఇవ్వడమంటే పిల్లికి బిక్షం పెట్టినట్లు కాదన్నారు. ఓడిపోయే నియోజకవర్గాలు ఇస్తాం అంటే ఎలా కుదురుతుందని మండిపడ్డారు. మా సీట్లు మాకు ఇస్తేనే మా వర్గం ఓట్లు కాంగ్రెస్ కు వస్తాయని బహిరంగంగానే తెలిపారు.

Read Also : Li Keqiang: చైనా మాజీ ప్రధాని గుండెపోటుతో మృతి