Site icon HashtagU Telugu

Renuka Chowdhury: ఢిల్లీ పోలీసులకు తడాఖా చూపిస్తాం: రేణుకా చౌదరి

Renuka Chowdhury

Renuka Chowdhury

renuka-chowdhury: కేంద్ర మంత్రి అమిత్ షాకు సంబంధించి ఓ వీడియోని మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా వీడియో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్ట్ అయినట్లు గుర్తించారు. దీంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఇతర కాంగ్రెస్ నేతలకు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంపై రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి ఘాటుగా సమాధానం ఇచ్చారు.

ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణకు వచ్చారంటూ రేణుక చౌదరి మండిపడ్డారు. ఏ హక్కుతో గాంధీభవన్‌కు వచ్చి తమ పార్టీ నేతలపై కేసులు పెట్టారని ఆమె ప్రశ్నించారు. ఇంకొకసారి ఇలా చేస్తే తెలంగాణ తడాఖా ఏమిటో చూపిస్తామని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నెహ్రూ, రాజీవ్ గాంధీ వంటి నేతలు ఇస్రో, ఇక్రిశాట్‌లను నిర్మించారని, అయితే ప్రభుత్వ సంస్థలను బీజేపీ అమ్ముతోందని ఆరోపించారు రేణుక చౌదరి. రైతులపై కారుతో దూసుకెళ్లిన కేంద్రమంత్రిపై చర్యలు తీసుకోలేదని, బీజేపీ నేతల లైంగిక వేధింపుల గురించి అందరికీ తెలుసునని, దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలని రేణుక చౌదరి సవాల్ విసిరారు. నీరవ్ మోదీ పారిపోయినట్లే రేవణ్ణ పారిపోయారు. బీజేపీ నేతలు ఇలా చేస్తుంటే ఎన్నికల అధికారులు మౌనం పాటిస్తున్నారా అని ప్రశ్నించారు.

We’re now on WhatsAppClick to Join

దేశంలోని ముస్లింలకు ప్రధాని మోదీ కాదా, ముస్లింలపై బీజేపీ నేతలు హేయమైన ఆరోపణలకు పాల్పడుతున్నారని ఆమె ఫైర్ అయ్యారు. అనేక మంది ముస్లింలు హిందూ దేవాలయాలకు విరాళాలు ఇచ్చారన్నారు.

Also Read: CM Jagan: ప్రముఖ దర్శకుడిని మోసం చేసిన సీఎం జగన్