Paleru Politics: షర్మిల ఏమైనా పాలేరులో పుట్టిందా.. ఎవరామె అసలు ?

వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేణుక చౌదరి ఫైర్ అయ్యారు. తెలంగాణ కోడలు అన్న విషయంపై ఆమె వ్యాఖ్యలు చేశారు.

Published By: HashtagU Telugu Desk
Paleru Politics

New Web Story Copy 2023 09 04t140947.762

Paleru Politics: వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ రేణుక చౌదరి(Renuka Chowdary) ఫైర్ అయ్యారు. తెలంగాణ కోడలు అన్న విషయంపై ఆమె వ్యాఖ్యలు చేశారు. షర్మిల తెలంగాణ కోడలు అయితే ఖమ్మం జిల్లాకు చెందిన కూతురు అలాగే కాంగ్రెస్ పార్టీలో చేరే వారిలో షర్మిల ఒక్కరేనా అని ప్రశ్నించారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. ఆమె పాలేరులో పుట్టారా అని ప్రశ్నించారు. పాలేరు (Paleru)లో పోటీ చేస్తానని చెప్పడానికి షక్మిల ఎవరు? ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనేది అధిష్టానమే నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.

వైఎస్‌ఆర్‌టీపీ విలీనంపై రాహుల్‌, సోనియాలను మాత్రమే కలిశానని షర్మిల అన్నారు. ఇంకా ఏమీ చెప్పలేదని అన్నారు. తెలంగాణలో షర్మిల ఎక్కడ పోటీ చేస్తారనే దానిపై నాయకత్వం నుంచి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని రేణుకా చౌదరి వ్యాఖ్యానించారు. అయితే వైఎస్సార్‌టీపీ విలీనాన్ని కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఇప్పటికే వ్యతిరేకిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏపీ నేతలకి పని ఏమిటి? ముందుగా అమరావతి రైతుల గురించి మాట్లాడాలని షర్మిలకు సూచించారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ లో రేణుకా చౌదరి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఫైర్ బ్రాండ్’గా గుర్తింపు తెచ్చుకున్న రేణుకాచౌదరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా విముఖత చూపుతున్నట్లు తెలుస్తోంది. ఆమె ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకోలేదు. 1984లో తెలుగుదేశం ద్వారా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె 1998లో కాంగ్రెస్‌లో చేరారు.ఇటీవల ఖమ్మం మన్యం ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. దీంతో ఆమె అసెంబ్లీకి పోటీ చేస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ఆమె అసెంబ్లీకి దూరంగా ఉన్నారు.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కీలక నేతగా ఉన్న గీతారెడ్డి కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. ఆమె గతంలో జహీరాబాద్, గజ్వేల్ నుంచి గెలిచారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య హయాంలో మంత్రిగా పనిచేశారు. 2014లో జహీరాబాద్ నుంచి గెలుపొందిన ఆమె.. 2018లో అదే నియోజకవర్గం నుంచి ఓడిపోయి.. ఆ తర్వాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్‌లోని కంటోన్మెంట్ నుంచి ఆమె పోటీ చేస్తారని వార్తలు వచ్చినా, ఆమె అసలు పోటీలో లేదు.

Also Read: YCP Special status : BJPతో కాపురం, కాంగ్రెస్ తో ప్రేమాయ‌ణం!జ‌గ‌న్ ల‌క్ !!

  Last Updated: 04 Sep 2023, 02:11 PM IST