Site icon HashtagU Telugu

Renu Desai : హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతకు సపోర్ట్ చేస్తున్న రేణు దేశాయ్.. స్పెషల్ పోస్ట్ వైరల్..

Renu Desai Supports Hyderabad BJP MP Candidate Madhavi Latha

Renu Desai Supports Hyderabad BJP MP Candidate Madhavi Latha

Renu Desai : ప్రస్తుతం దేశమంతా ఎన్నికల వేడి నడుస్తుంది. హైదరాబాద్ ఎంపీ సీట్ ఫైట్ ఈసారి అందరికి ఆసక్తి కలిగిస్తుంది. ప్రతిసారి MIM పార్టీ హైదరాబాద్ ఎంపీ సీట్ ని ఈజీగా గెలిచేస్తుంది. ప్రస్తుతం MIM నుంచి అసదుద్దీన్ ఒవైసి ఎంపీగా ఉన్నారు. కానీ ఈసారి బీజేపీ(BJP) విరించి హాస్పిటల్ చైర్మన్, హిందూ యాక్టివిస్ట్ మాధవీలతకు(Madhavi Latha) టికెట్ ఇచ్చింది. దీంతో దేశమంతా హైద్రాబాద్ సీట్ పై చర్చగా మారింది.

ఇక మాధవీలత తన గళంతో దూసుకుపోతూ ఫైర్ బ్రాండ్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా పాతబస్తీ సమస్యలు, ముస్లిం మహిళల సమస్యల గురించి మాట్లాడుతుంది. గతంలో ముస్లిం మహిళల కోసం ట్రిపుల్ తలాక్ రద్దుపై కూడా మాధవీలత పోరాడింది. ప్రస్తుతం మాధవీలత ప్రచారంలో దూసుకుపోతుంది. తాజాగా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ మద్దతు ఇచ్చింది.

రేణు దేశాయ్ తన సోషల్ మీడియాలో మాధవీలత ఫోటో షేర్ చేస్తూ.. చాలా రోజుల తర్వాత నేను ఒక స్ట్రాంగ్ వుమెన్ ని చూస్తున్నాను. నేను ఈ పోస్ట్ పెట్టినందుకు నాకు ఎలాంటి డబ్బులు రాలేదు. నేను ఫీల్ అయ్యాను కాబట్టి షేర్ చేస్తున్నాను అని పోస్ట్ చేసింది. ఇలా పోస్ట్ చేసి నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళకి ముందే కౌంటర్ ఇచ్చింది. దీంతో రేణుదేశాయ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఈసారి ఎంపీ ఎన్నికల్లో మాధవీలత గెలుస్తుందో లేదో తెలీదు కానీ అసదుద్దీన్ కి మాత్రం గట్టి పోటీ ఇవ్వనుంది.

 

Also Read : Lok Sabha Elections : హైద‌రాబాద్ బీజేపీ ఎంపీ అభ్య‌ర్థి మాధ‌వీల‌త ఆస్తులు ఎంతో తెలుసా..?