KTR : తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు భారీ ఊరట లభించింది. ఆదిలాబాద్ జిల్లా ఊట్నూర్ పోలీస్ స్టేషన్ లో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్ ను ఉన్నత న్యాయ స్థానం కొట్టివేసింది. రూ.లక్షన్నర కోట్లతో చేపడుతోన్న మూసీ ప్రాజెక్ట్ దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ ఉట్నూర్‌లో జరిగిన ఓ సభలో కేటీఆర్ ప్రస్తావించారు. దేశంలో రాబోయే ఎన్నికల కోసం కావలసిన నిధులను కాంగ్రెస్ మూసీ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్‌లా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు.
Read Also: Panchayat Award : గొల్లపూడి గ్రామ పంచాయతీకి జాతీయ అవార్డు
ఇక, కాంగ్రెస్ పార్టీ మూసీ ప్రాజెక్టు పేరుతో రూ.25 వేల కోట్ల నిధులను తరలించిందంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలతో తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశారంటూ ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఆత్రం సుగుణ ఉట్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిని తగ్గించేలా నిరాధారమైన ఆరోపణలు చేసిన కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ చేపట్టిన పోలీసులు బీఎన్‌ఎస్ సెక్షన్లు 352, 353(2), 356(2) కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు పోలీసు స్టేషన్‌లో గత ఏడాది సెప్టెంబరు 30న కేసు నమోదైంది. ఈక్రమంలో కేసును కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించారు. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ఈ కేసు రాజకీయ ప్రేరేపిత కేసుగా భావించి తాజాగా ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేసింది.
కాగా, ఈ తీర్పు రాజకీయ ప్రేరేపితమా? లేక న్యాయపరమైనదా? అన్న చర్చలు కొనసాగుతున్నాయి. ఈ కేసు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలకు దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: JD Vance : భారత్‌కు చేరుకున్న జేడీ వాన్స్..సాయంత్రం ప్రధానితో భేటీ