Site icon HashtagU Telugu

Congress: రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌.. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ విడుదల

Release Of Mahalakshmi Scheme Guidelines

Release Of Mahalakshmi Scheme Guidelines

 

Congress Govt: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్‌ అలర్ట్‌. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్(Mahalakshmi Scheme Guide Lines)విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. మహిళల ఆరోగ్యం కాపాడుతూ, పొగబారి నుంచి మహిళలను విముక్తి కల్పించడం మహాలక్ష్మీ పథకం ముఖ్య ఉద్దేశ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. మహాలక్ష్మీ పథకం గైడ్ లైన్స్ ప్రకారం… ప్రజా పాలన(Praja Palana) దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు కానున్నారు.

read also : Beauty Tips: ముఖంపై ఉండే మచ్చలు మాయం అవ్వాలంటే కొబ్బరి నూనెలో ఇది కలిపి రాయాల్సిందే?

తెల్ల రేషన్ కార్డు(White ration card) కలిగి ఉన్న వాళ్ళు అర్హులు అవుతారు. గ్యాస్ కనెక్షన్ మహిళా పేరు మీద ఉండాలి. గడిచిన మూడు సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనుంది ప్రభుత్వం. సబ్సిడీ గ్యాస్ పేమెంట్ ను ప్రభుత్వం ప్రతినెలా ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లింపులు చేస్తుంది.

< ప్రజా పాలన దరఖాస్తు చేసుకుని ఉన్నవాళ్లు అర్హులు
< తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు అర్హులు
< గ్యాస్ కనెక్షన్ మహిళా పేరు మీద ఉండాలి
< గడిచిన మూడు సంవత్సరాలుగా గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని పరిగణనలోకి తీసుకోనున్న ప్రభుత్వం
< సబ్సిడీ గ్యాస్ పేమెంట్ ను ప్రభుత్వం ప్రతినెలా ఆయా గ్యాస్ కంపెనీలకు చెల్లింపు

We’re now on WhatsApp. Click to Join.

కాగా, ఆరు గ్యారెంటీల అమలు ప్రతిష్ఠాత్మకం కావడంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున మహిళలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక ఈ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక లోక్‌సభ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేలోపే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం కూడా ప్రారంభించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.