తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC ) గ్రూప్-2 (Group 2)ప్రాథమిక కీ(Key)ని రేపు (జనవరి 18న) విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాథమిక కీ జనవరి 18 నుంచి 22 వరకు అభ్యర్థుల లాగిన్‌లో అందుబాటులో ఉండనుంది. అభ్యర్థులు ఈ వ్యవధిలోనే తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను స్వీకరించేందుకు టీజీపీఎస్సీ ఆన్లైన్ ప్రక్రియను ఏర్పాటు చేసింది. అభ్యర్థులు తమ అభ్యంతరాలను కేవలం ఇంగ్లీష్ భాషలోనే తెలపాలని సూచించారు. అభ్యంతరాలను తెలపడానికి సంబంధించిన సమాచారాన్ని స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఏ పుస్తకంలోనిది? ఆథర్ ఎవరు? ఎడిషన్, పేజీ నంబర్, పబ్లిషర్స్ పేరు లేదా వెబ్‌సైట్ యూఆర్ఎల్‌ను మెన్షన్ చేయాలని చెప్పారు.
Nara Lokesh : లోకేష్ నోటివెంట క్షమాపణలు ..ఎందుకంటే..!!
ఇక అభ్యంతరాలను ఈ మెయిల్ ద్వారానే పంపాలన్నారు. అభ్యంతరాలను తెలపడానికి టీజీపీఎస్సీ ప్రత్యేకంగా ఈ మెయిల్ విధానాన్ని అందుబాటులో ఉంచింది. అభ్యర్థులు చెప్పదలచుకున్న విషయాలను ఈ మెయిల్ ద్వారా పంపించాలని సూచించారు. ఇక డిసెంబరు 15, 16 తేదీల్లో గ్రూప్-2 రాత పరీక్షలు నిర్వహించగా, రాష్ట్ర వ్యాప్తంగా 1368 పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు జరిగాయి. 783 గ్రూప్-2 పోస్టుల భర్తీ కోసం టీజీపీఎస్సీ ఈ పరీక్షలను నిర్వహించింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను 22వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు మాత్రమే స్వీకరించనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ విధానాన్ని ఉపయోగించి అభ్యర్థులు తమ సందేహాలు, అభ్యంతరాలను సమర్పించవచ్చు. టీజీపీఎస్సీ తాజా ప్రకటన అభ్యర్థుల్లో ఆసక్తి మొదలైంది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను సమర్పించడం ద్వారా తమ సమాధానాలను చక్కదిద్దుకోవడానికి ఇది చక్కటి అవకాశం.