మొన్నటి వరకు కేసీఆర్ ను దేవుడని , తండ్రిలాంటి వారని కొలిచిన వారే..ఇప్పుడు బిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోయేసరి కేసీఆర్ ఓ రాక్షసుడని, ప్రజలను పీడించేవారని విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ (MLA Rekha Nayak) ..కేసీఆర్ (KCR) ఫై తీవ్రమైన పదజాలంతో దూషించడం బిఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహం తెప్పిస్తుంది.
We’re now on WhatsApp. Click to Join.
బుధువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖానాపూర్ నియోజకవర్గం ఉట్నూర్‌లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రజా గర్జన సభ (Congress Praja garjana Sabha)లో రేఖా నాయక్ పాల్గొన్నారు. ఈ సభలో ఆమె మాట్లాడుతూ.. ‘ఏం రా కేసీఆర్.. ఏం మొఖం పెట్టుకుని ఖానాపూర్‌లో ఓట్లు అడుగుతావ్’ అంటూ వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. కేవలం కేసీఆర్ ను మాత్రమే కాదు కేటీఆర్ (KTR) ఫై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘కేటీఆర్.. నీ ఫ్రెండ్ జాన్సన్ నాయక్ గెలుస్తాడని ఎలా చెబుతావ్..? నీ చెంచాలు, గ్లాసులు ఎత్తేవాళ్లకు ఖానాపూర్‌లో ఓట్లు ఎలా వేస్తాం’’ అని మండిపడ్డారు. అసలు కేసీఆర్‌కు ( CM Kcr ) బుద్ధి ఉందా అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
ఇక బిఆర్ఎస్ టికెట్ వస్తుందని ఆశపడ్డ రేఖా నాయక్..టికెట్ రాకపోయేసరికి కాంగ్రెస్ లో చేరింది. కానీ కాంగ్రెస్ కూడా ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అయినప్పటికీ నిరాశ పడకుండా కాంగ్రెస్ పార్టీ కి ప్రచారం చేస్తున్నారు.
Read Also : Hyderabad: ప్రతి ముఖ్యమంత్రికి ఎంఐఎం గులామ్: జగ్గారెడ్డి