Site icon HashtagU Telugu

Real Estate : “మే”లో ” రియల్” మెరుపులు.. హైదరాబాద్ లో బూమ్

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ ఏమాత్రం తగ్గలేదు. గత ఏడాది మే నెలతో పోలిస్తే.. ఈ ఏడాది మేలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు 1.5 రెట్లు (152 శాతం) పెరిగాయి. మే నెలలో 6,301 ఆస్తుల అమ్మకాలు జరిగాయి. వీటి మొత్తం విలువ రూ.3,058 కోట్లు. ఏప్రిల్ తో పోలిస్తే మే నెలలో ఆస్తుల అమ్మకాల్లో 17.6 శాతం వృద్ధి నమోదైంది.

ఇదే వ్యవధిలో ఆస్తుల అమ్మకాల విలువ 9.9 శాతం ఎగబాకింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు రిజిష్టర్ అయిన ఆస్తుల విలువ హైదరాబాద్ లో రూ.15,071 కోట్లకు చేరింది. గతేడాది ఇదే వ్యవధి (జనవరి – మే)లో రిజిష్టర్ అయిన ఆస్తుల విలువ రూ.13,459 కోట్లు మాత్రమే. ఈ ఏడాది మే లో రిజిష్టర్ అయిన ఆస్తుల్లో రూ. 25 లక్షల నుంచి రూ.50 లక్షల ఇళ్లే 55 శాతం ఉన్నాయి. రూ.25 లక్షల్లోపు ఇళ్ల కు గత నెలలో డిమాండ్ తగ్గి, 18 శాతానికే పరిమితమైంది.

ఇదే సమయంలో రూ.50 లక్షలకు మించిన ఇళ్ల కు డిమాండ్ 27 శాతం పెరిగింది. ఈ మే నెలలో అమ్ముడుపోయిన ఇళ్లలో దాదాపు 81 శాతం 1000 చదరపు అడుగుల ఇళ్లే ఉన్నాయి. ఒక రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ తాజా అధ్యయనం లో ఈవివరాలు వెల్లడయ్యాయి.

Exit mobile version