Rain Alert Today : తెలంగాణలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్.. ఏపీలోని 9 జిల్లాల్లో ఇవాళ వానలు

Rain Alert Today : రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి.

Published By: HashtagU Telugu Desk
Rain Alert Today

Rain Alert Today : రాగల మూడు రోజులు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో పాటు గంటకు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. వాతావరణ విభాగం 7 జిల్లాలకు రెడ్ అలర్ట్  జారీ చేసింది. ఆ జిల్లాల్లో  ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి ఉన్నాయి. రెడ్ అలర్ట్  ఇష్యూ అయిన జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 11 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయింది.  ఆ జిల్లాల్లో నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి ఉన్నాయి. తెలంగాణలోని మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేశారు.

Also read : Missing Minister Removed : చైనా మిస్సింగ్ మినిస్టర్ తొలగింపు.. కొత్త విదేశాంగ మంత్రి నియామకం

రాగల మూడు రోజులు..  

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజులు విస్తారంగా వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు(Rain Alert Today) అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, పశ్చిమగోదావరి, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, శ్రీ సత్యసాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్నారు. ఏపీలో రేపు అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.

Also read : Hair Tips: తెల్లజుట్టు నల్లగా మారాలంటే.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?

  Last Updated: 26 Jul 2023, 08:00 AM IST