Munugode Liquor: మందు బాబులం.. మేం మందు బాబులం.. మునుగోడులో ఏ రేంజ్ లో తాగారంటే!

తెలంగాణలో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహమే కాదు.. మద్యం సైతం ఏరులై పారుతోంది.

  • Written By:
  • Updated On - November 2, 2022 / 03:36 PM IST

తెలంగాణలో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు ప్రవాహమే కాదు.. మద్యం సైతం ఏరులై పారుతోంది. మునుగోడు ఏ పల్లెకెళ్లినా.. ఏ గుడిసేకెళ్లినా మద్యం సీసాలే కనిపిస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలను చూసి వామ్మో ఇదేందీ తాగుడు అంటూ ఇతర ప్రాంతాల ప్రజలు విమర్శిస్తున్నారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల అయినప్పటి నుంచి మద్యం అమ్మకాలు భారీగా పెరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.

ఒక్క అక్టోబర్ నెలలోనే.. దాదాపు రూ.200 కోట్ల మద్యం (liquor) అమ్మకాలు జరిగినట్టు సమాచారం. అయితే.. ఈ రేంజ్‌లో మద్యం అమ్మకాలు జరగడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. మునుగోడులో ప్రగతి గుట్టలు గుట్టలుగా ఉంది అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంత మొత్తంలో మునుగోడు అభివృద్ధికి ఇంత ఖర్చు చేస్తే బాగుండేదనే వ్యాఖ్యానాలు చక్కర్లు కొడుతున్నాయి. క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం.. ఓట్లకు కూడా భారీగా డబ్బులు ఇస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒక్కో ఓటుకు రూ.10 వేల వరకు పంచుతున్నట్టు సమాచారం. ప్రజలే కాదు.. పార్టీలు కూడా ఇవే ఆరోపణలు చేస్తున్నాయి.

Also Read:  Munugode Voters: డ‌బ్బిస్తేనే ఓటు! రోడ్లపై మ‌హిళా ఓట‌ర్లు!!

మునుగోడు నియోజకవర్గం నుంచి.. ఖాళీ మద్యం సీసాలు వెళ్లమీదే లెక్కపెట్టేలా వెళ్లేవి. కానీ ఇప్పుడు ఎన్ని ఖాళీ మద్యం సీసాలు వస్తున్నాయో.. చెప్పడం కష్టమని వ్యాపారులు అంటున్నారు. ఇక దీనిపై జనాలు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. మునుగోడులో ప్రగతి గుట్టలుగుట్టలుగా కనిపిస్తోందని అంటున్నారు. మునుగోడు అభివృద్ధి కోసం ఖర్చు చేస్తే.. కనీసం రోడ్లు అయినా.. వేయిస్తే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డబ్బులు(Money) పంచుతున్నారని ప్రచారం ఉండనే ఉంది.