Site icon HashtagU Telugu

Rama Rao On Duty: రామారావు ఆన్ డ్యూటీ!

Ktr On Duty

Ktr On Duty

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో ఉన్న పలు పట్టణాల పరిస్థితుల పైన పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రగతి భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిహెచ్ఎంసి, జలమండలి, పురపాలక శాఖ అధికారుల నుంచి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ప్రాణ నష్టం జరగకుండా చూడడమే లక్ష్యంగా అన్ని పురపాలికలు పనిచేయాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లోని భారీ వర్షాల వలన ప్రభావితమైన ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించి సహాయక చర్యలను వేగంగా ముందుకు తీసుకుపోవాలని సూచించారు. వర్షాలు ఇలాగే కొనసాగితే చేపట్టాల్సిన ముందస్తు జాగ్రత్త చర్యల పైన కూడా ఇప్పటినుంచే సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వరుసగా కురుస్తున్న వర్షాల వలన పురాతన భవనాలు కూలే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ప్రమాదకరంగా ఉన్న వాటిని తొలగించే చర్యలు కొనసాగించాలని సూచించారు.

ముఖ్యంగా పట్టణాల్లో ఉన్న కల్వర్టులు, బ్రిడ్జిలకు సంబంధించిన ప్రాంతాల పైన ప్రధాన దృష్టి సారించి హెచ్చరిక సూచీలను ఏర్పాటు చేయాలన్నారు. స్థానికంగా ఉన్న పోలీస్, సాగునీటి, విద్యుత్ మరియు రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ నగరం మరియు పరిసర పురపాలికల్లోని యంత్రాంగం, స్థానిక జలమండలి కలిసి వరద నివారణ/తగ్గింపు చర్యలు చేపట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న జిహెచ్ఎంసి, జలమండలి కమాండ్ కంట్రోల్ సెంటర్లను విస్తృతంగా ఉపయోగించుకోవాలి.

రాష్ట్రంలోని అన్ని పూరపాలికల్లో చేపడుతున్న చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిడిఎంఏ ను ఆదేశించారు. పట్టణాల్లో ఉన్న లోతట్టు ప్రాంతాలపైన ప్రధానంగా దృష్టి సారించాలి. పట్టణాలు పట్టణాలకు ఆనుకొని ఉన్న చెరువులు, కుంటలు, ఇతర సాగునీటి వనరులకు సంబంధించిన పర్యవేక్షణను నిరంతరం కొనసాగించాలి. వాటి యొక్క పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం, ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వంటి పై సాగునీటి శాఖతో నిరంతరం పర్యవేక్షణ చేయాలి. వర్షాలు తగ్గుముఖం పట్టగానే అత్యవసరమైన రోడ్ల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలన్నారు.

Exit mobile version