Site icon HashtagU Telugu

CM Revanth Reddy: ఆధారాలున్నాయి అంటున్న క్రిశాంక్, రేవంత్ సమాధానం చెప్పాలి

CM Revanth Reddy

CM Revanth Reddy

CM Revanth Reddy: మాదాపూర్ పోలీసులు తన ఫోన్‌ను సీజ్ చేసిన మరుసటి రోజు బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరాడు. తన సోదరుడి భూకబ్జా విషయంలో తన వద్ద ఆధారాలు ఉన్నాయంటూ, ఏ కోర్టులోనైనా నీరూపిస్తానని తెగేసి చెప్పాడు క్రిశాంక్. దీంతో ఈ ఇష్యూ మరింత హాట్ హాట్ గా నడుస్తుంది.

చిత్రపురి సొసైటీలో రూ.3,000 కోట్ల విలువైన భూమిని లాక్కున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు అనుముల మహానందరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నాడు క్రిశాంక్. అయితే ఈ కబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని కోర్టులో నిరూపించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్రిశాంక్ మన్నె సవాల్ విసిరారు. ఒక సొసైటీలో భూమిని లాక్కున్నందుకు మహానంద రెడ్డిని నిందించిన వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేయడంతో మాదాపూర్ పోలీసులు బుధవారం క్రిశాంక్‌పై కేసు నమోదు చేశారు. అతడి ఫోన్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు క్రిశాంక్ పై కేసు బుక్ చేశారు.

Also Read: Ilaiyaraaja: వెర్సటైల్ యాక్టర్ ధనుష్ ప్రధాన పాత్రలో మ్యాస్ట్రో ఇసైజ్ఞాని ‘ఇళయరాజా’ బయోపిక్ లాంఛనంగా ప్రారంభం