ఫార్ములా ఈ రేసు కేసు(Formula E Car Race Case)లో తెలంగాణ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను విచారించేందుకు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ (Governor Green Signal) ఇచ్చారు. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. గవర్నర్ అనుమతి కారణంగా ఏసీబీ విచారణ ప్రారంభించేందుకు సిద్ధమైంది. మొదట కేటీఆర్‌కు నోటీసులు పంపించి, విచారణకు హాజరుకావాల్సిందిగా ఆదేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహణ సమయంలో భారీ నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేయడం, రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీలతో ఒప్పందాలు చేసుకోవడం వంటి అంశాలు విచారణలో వెలుగుచూశాయి. ఇక ఈ కేసులో అరెస్ట్ చేయాలనుకుంటే తాను సిద్దమని కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇప్పుడు గవర్నర్ అనుమతితో కేటీఆర్ కు ఉచ్చు బిగుస్తోంది. అరెస్ట్ ఖాయమనే వాదన తెర మీదకు వస్తుంది. ఒకటి రెండు రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నా యి. ఫార్ములా ఈ రేసు కేసులో రూ 46 కోట్ల చెల్లింపుల విషయంలో కేటీఆర్ పైన అభియోగాలు ఉన్నాయి. హెచ్ఎండీఏ అనుమతి లేకుండా మంత్రిగా కేటీఆర్ చెల్లింపులు చేసారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇందులో కేటీఆర్ తో పాటు అప్పటి మున్సిపల్ ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్, చీఫ్ ఇంజినీర్ లను కూడా విచారించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ ఫార్ములా రేసు నిధుల మళ్లింపునకు సంబంధించి అర్వింద్ కుమార్ కు నోటీసులు జారీ చేశారు. తాను మంత్రిగా ఈ ఫార్ములా రేసు కోసం నిధులను విడుదల చేసానని కేటీఆర్ చెబుతున్నారు. ఈ నిధుల కంటే ఈ రేసు ద్వారా హైదరాబాద్ కు వచ్చిన ఇమేజ్ చాలా ఎక్కువ ఉందనే నివేదికలు ఉన్నాయన్నారు. అయితే, ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇవ్వడం తో ప్రభుత్వం ఈ కేసుపై పట్టుబిగించే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం తెలంగాణ లో అరెస్టుల పర్వం కాకరేపుతున్నాయి. తాజాగా సినీ యాక్టర్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం..కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడం ప్రభుత్వం పై విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కేటీఆర్ ను కూడా అరెస్ట్ చేస్తే ఇంకా ఏ రేంజ్ లో విమర్శలు వస్తాయో చూడాలి.
Read Also : Allu Arjun Arrest : అసలు బెన్ఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది ఎవరు..? : హరీశ్ రావు