Reactor Blast : ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం – ఆరుగురు మృతి

ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో కార్మికులు పని చేస్తుండగా.. ఒక్కసారిగా రియాక్టర్ పేలింది

Published By: HashtagU Telugu Desk
Reactor Blast At Sb Organic

Reactor Blast At Sb Organic

సంగారెడ్డి (Sangareddy ) జిల్లా ఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీ(SB Organics Limited)లో భారీ అగ్నిప్రమాదం(Fire Accident) జరిగింది. ఈ ప్రమాదం లో ఆరుగురు మరణించినట్లు తెలుస్తుంది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. హత్నూర మండలం చందాపూర్ వద్ద ఉన్నఎస్బీ కెమికల్ ఫ్యాక్టరీలో రోజూ లాగే బుధవారం కూడా ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీలో కార్మికులు పని చేస్తుండగా.. ఒక్కసారిగా రియాక్టర్ పేలింది. ఈ పేలుడు దాటికి ఎస్బీ ఆర్గానిక్స్ ఫ్యాక్టరీ డైరెక్టర్‌ రవితోపాటు మరో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తుంది. ఆ తర్వాత మరికొందరు కార్మికులు కూడా చనిపోయినట్లు అక్కడి సిబ్బంది చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో మరికొందరు కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాద సమాచారం అందగానే.. ఫైర్ సిబ్బంది ఎస్బీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నాలు చేపట్టారు. భారీగా ఎగిసిపడిన మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది.. తీవ్ర ప్రయత్నాలు చేశారు. మంటల్లో చిక్కుకుని కార్మికులు చేసే రోదనలతో ఆ ప్రాంతం మొత్తం భీతావహంగా మారిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ ఘటనలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. ప్రమాదం జరిగిన వెంటనే స్పాట్‌లోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మృతులు డైరెక్టర్ రవి, కార్మికులు దయానంద, సుబ్రహ్మణ్యం, సురేష్ పాల్‌గా గుర్తించారు. ఇక మరో 10 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కూడా అయినట్లు తెలుస్తుంది. ప్రమాదం సమయంలో దాదాపు 50 మంది కార్మికులు ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ ఘోర ప్రమాదంలో మృతులు, గాయాలైన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ ప్రమాద ఘటన ఫై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఘటనాస్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని ఫైర్ డీజీ నాగిరెడ్డిని ఆదేశించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్, ఎస్పీకి సూచించారు. మంత్రులు దామోదర, కొండా సురేఖ ఫ్యాక్టరీ వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

Read Also : Tibetan Singing Bowls : టిబెటన్ సింగింగ్ బౌల్స్ గురించి విన్నారా? అనేక ఆరోగ్య సమస్యలు తీరుస్తాయి..

  Last Updated: 03 Apr 2024, 08:35 PM IST