KTR On Modi: కరెన్సీ నోట్లపై మోడీ ఫొటోలనూ ముద్రిస్తారా?

అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చడంపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published By: HashtagU Telugu Desk
KTR, bjp govt

Ktr And Modi

అహ్మదాబాద్‌లోని ఎల్‌జీ మెడికల్ కాలేజీ పేరును నరేంద్ర మోదీ మెడికల్ కాలేజీగా మార్చడంపై తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఓ ట్వీట్‌లో అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంకు ప్రధాని నరేంద్ర మోదీ పేరు పెట్టారని కేటీఆర్ గుర్తు చేశారు. మహాత్మా గాంధీ స్థానంలో కరెన్సీ నోట్లపై నరేంద్ర మోడీ ఫోటోను ముద్రించాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) త్వరలో ఆదేశించవచ్చని మంత్రి పేర్కొన్నారు.

దేశ రాజధానిలో ముస్తాబవుతున్న కొత్త పార్లమెంట్ భవనానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని తెలంగాణ అసెంబ్లీ ఇటీవల తీర్మానం చేసింది. తెలంగాణా ఆమోదించిన తీర్మానాన్ని గౌరవించాలని కోరుతూ ప్రధానికి లేఖ రాస్తానని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు (కేసీఆర్) గురువారం తెలిపారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం వల్లే తెలంగాణకు ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు.

  Last Updated: 16 Sep 2022, 01:18 PM IST