Site icon HashtagU Telugu

Whats Today : బీఆర్ఎస్ లోకి రావుల, జిట్టా.. చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ

Whats Today

Whats Today

Whats Today : టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిలు ఇవాళ  హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో  బీఆర్ఎస్ లో చేరనున్నారు. రావుల వనపర్తి నియోజకవర్గం నుంచి 1994, 2009లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీఆర్ఎస్ లో చేరికపై మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ రమణలు ఇటీవల రావులతో చర్చించారు. మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు రావుల ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలిసింది. జిట్టా బాలకృష్ణారెడ్డి గతంలో బీఆర్ఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా(Whats Today) పనిచేశారు. 2009లో భువనగిరి అసెంబ్లీ టికెట్‌ దక్కకపోవడంతో పార్టీని వీడారు.

We’re now on WhatsApp. Click to Join.

  • రాహుల్ గాంధీ మూడో రోజు విజయభేరి బస్సు యాత్ర ఇవాళ జరగనుంది.  ఉదయం 9 గంటలకు చొప్పదండి అసెంబ్లీ నియోజక వర్గం గంగాధర వద్ద సమావేశంతో యాత్ర మొదలవుతుంది.  9.30 గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో రాహుల్ ప్రత్యేక పూజలు చేస్తారు.  మధ్యాహ్నం 2.30 గంటలకు ఆర్మూర్ పట్టణంలో సభ ఉంది. ఆర్మూర్ నుంచి హైదరాబాద్ కు చేరుకుని, రాహుల్ ఢిల్లీకి వెళ్తారు. నేటితో మొదటి దశ కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర ముగుస్తుంది.
  •  ఇవాళ కాంగ్రెస్ పార్టీలోకి ఖానాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేఖా నాయక్.. ఆర్మూర్ సభ లో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరిక.
  • ఇవాళ ఉదయం 9 గంటలకు రాహుల్‌ను కలవనున్న కోదండరాం.. కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేయాలని కోదండరాంని కోరనున్న రాహుల్ గాంధీ.
  • ఇవాళ సిద్దిపేట జిల్లాలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పర్యటించనున్నారు. దుబ్బాకలో నారి శక్తి వందన్ కార్యక్రమంలో పాల్గొననున్న స్మృతి ఇరానీ.. అనంతరం దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
  • ఇవాళ సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ  కానుంది.

Also Read: EC – Bank Managers : బ్యాంకు మేనేజర్లకు ఎన్నికల సంఘం ఆర్డర్స్.. ఏమిటో తెలుసా ?