Site icon HashtagU Telugu

Rajaiah VS Kadiyam: చంద్రబాబు, కడియంపై ఎమ్మెల్యే ‘రాజయ్య’ సంచలన ఆరోపణలు

Rajaiah

Rajaiah

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై స్టేషన్‌ఘన్‌పూర్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. స్టేషన్ ఘన్ పూర్ పరిధిలోని చిన్నపెండ్యాల గ్రామంలో లబ్ధిదారులకు నూతన పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. 1994-2004లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా ఉన్న కడియం శ్రీహరి నియోజకవర్గంలోనే వివిధ ఎన్‌కౌంటర్లలో 361 మంది నక్సల్స్ మృతి చెందారని ఆరోపించారు. రాష్ట్రం మొత్తంతో పోలిస్తే స్టేషన్‌ఘన్‌పూర్‌ సెగ్మెంట్‌లో ఎక్కువ మంది నక్సల్స్‌ ఎన్‌కౌంటర్‌ జరిగిందని రాజయ్య అన్నారు.

పదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కార్యకర్తలకే రేషన్‌కార్డులు, ఇళ్లు వచ్చాయని రాజయ్య పేర్కొన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో స్టేషన్‌ఘన్‌పూర్‌ నుంచి టీఆర్‌ఎస్‌ గుర్తుపై పోటీ చేయాలనే ఉద్దేశంతో రాజయ్య శ్రీహరిని లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం. కాగా, రాజయ్య తనపై ఆరోపణలు చేయడంతో శ్రీహరి తన అనుచరులతో సమావేశమయ్యారు. అతి త్వరలో ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. గతకొంతకాలంగా కడియం శ్రీహరికి, ఎమ్మెల్యే రాజయ్యకు ఏమాత్రం పొంతన కుదరడం లేదు. స్టేషన్ ఘన్ పూర్ పై పట్టు సాధించేందుకు ఇద్దరు నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకరిపై మరొకరు విమర్శలకు దిగుతున్నారు. ప్రస్తుతం రాజయ్య వ్యాఖ్యలకు కడియం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చేందుకు మీడియా ముందుకు వచ్చాడు.

‘‘ఆయన చరిత్ర ఏంటో తనకు తెలుసని.. టీడీపీ నేతలను అడిగితే ఇంకా బాగా చెబుతారని ఎద్దేవా చేశారు. భార్యతో దెబ్బులు తిన్న కడియం శ్రీహరి తన గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. శ్రీహరిపై తాను ఉద్దేశపూర్వకంగా వ్యాఖ్యలు చేయలేదన్నారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎప్పటికీ తన అడ్డాయేనని.. ఎవరెన్ని కుట్రలు పన్నినా దాటుకుని ముందుకెళ్తానని అన్నారు. కడియం శ్రీహరి చీకటి బాగోతం తనకు తెలుసని.. పార్టీకి వచ్చిన ఫండ్‌ కూడా సొంతానికి వాడేసుకున్న చరిత్ర ఆయనదని మండిపడ్డారు. ఆయన అంత సమర్థుడే అయితే ఎమ్మెల్యే టిక్కెట్ తెచ్చుకోవాలని సవాల్ చేశారు’’ కడియం శ్రీహరి.

 

Exit mobile version