Site icon HashtagU Telugu

Rathod Bapu Rao : కాంగ్రెస్ లో చేరిన బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

Rathod Bapu Rao

Rathod Bapu Rao

లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ లో కాంగ్రెస్ (Congress) పార్టీలోకి వలసల పర్వం రోజు రోజుకు ఎక్కువతున్నాయి. బిఆర్ఎస్ (BRS) నుండి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు , జడ్పీటీసీ , ఎంపీటీసీ లు ఇలా ఫై స్థాయి నేతల నుండి కింద స్థాయి నేతల వరకు ఆయా నియోజవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటూ వస్తున్నారు. తాజాగా ఈరోజు సోమవారం బిఆర్ఎస్ కీలక నేత, బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు (BRS Ex MLA Rathod Bapu Rao)..సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగిన ఆయన ముందుగా కాంగ్రెస్ పార్టీలో చేరి వెనువెంటనే బీజేపీలోకి మారారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి పార్టీ టికెట్ ఇవ్వకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరారు. మంత్రి సీతక్క, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, బోత్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆడే గజేందర్, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు సమక్షంలో నేడు కాంగ్రెస్ లో చేరారు. నిర్మల్ మున్సిపల్ చైర్మన్ జి ఈశ్వర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయనతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరి చేరికతో బోథ్ నియోజవర్గంలో కాంగ్రెస్ కు మరింత పట్టు పెరిగినట్లు అయ్యింది.

Read Also : Gorantla Butchaiah : ముఖానికి బ్యాండేజ్‌లు వేసుకొని గోరంట్ల వినూత్న నిరసన..