Hyderabad : మానవత్వం మంట కలిసిందనే దానికి ఇదే ఉదాహరణ..

  • Written By:
  • Publish Date - February 12, 2024 / 02:10 PM IST

ఇటీవల కాలంలో మనుషుల్లో స్వార్థం అనేది విపరీతంగా పెరిగిపోయింది..ఏమాత్రం జాలి , దయ లేకుండా ప్రవర్తిస్తున్నారు. డబ్బులకే విలువ ఇస్తున్నారు తప్ప సతి మనిషి ఆపదలో ఉంటె కాపాడడం..సాయం చేద్దాం అనేది మరచిపోతున్నారు. దీనికి ఉదాహరణే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటన. ఓ వ్యక్తి బైక్ ట్రాన్స్‌పోర్టు సర్వీసు (Rapido Bike Taxi Rider)లో టూవీలర్‌ను బుక్ చేసుకున్నాడు. అయితే బైక్ మధ్యలోనే పెట్రోల్ (Runs Out of Petrol) అయిపోవడం తో ఆగిపోయింది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ క్రమంలో ఎవరైనా బైక్ దిగి వేరే బైక్ బుక్ చేసుకోవడమో..లేక పెట్రోల్ బంక్ వరకు నడిచి వెళ్లడమో చేస్తారు..కానీ సదరు వ్యక్తి మాత్రం ఏమాత్రం జాలి , దయ లేకుండా తాను బైక్ దిగనని.. బైక్ రైడర్‌తో తెగేసి చెప్పాడు.. దీంతో చేసేందేం లేక సదరు డ్రైవర్ ఆ కస్టమర్‌ను అలాగే కూర్చుబెట్టుకొని మండు ఎండలో బైక్ ను తోసుకుంటూ పెట్రోల్ బంక్ వరకు తీసుకెళ్లారు. అందుకు సంబంధించిన వీడియోను వెనకే వస్తున్న ఓ వ్యక్తి కెమెరాలో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఈ వీడియో చూసిన వారంతా సదరు కస్టమర్ ఫై విమర్శలు చేస్తున్నారు. పార్ట్‌టైం సంపాదన కోసం ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ యాప్‌ల ద్వారా పని చేసే వాళ్ళు కూడా మనుషులేనని వారిపట్ల అలా ప్రవర్తించటం సరైంది కాదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read Also : Revanth Vs Harish : కొడంగల్‌ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చావా రేవంత్…? – హరీష్ రావు కౌంటర్