Site icon HashtagU Telugu

Ramoji Smruti Vanam : స్మారక కట్టడాన్ని ముందే రెడీ చేసుకున్న రామోజీ

Ramoji Smruti Vanam

Ramoji Smruti Vanam

Ramoji Smruti Vanam : మీడియా మొఘల్ రామోజీరావు దార్శనికుడు.  ఆయన తన స్మారక కట్టడాన్ని ముందే నిర్మించి పెట్టుకున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ శివార్లలో ఉన్న విశాలమైన స్థలంలో రామోజీరావు ప్రత్యేక  స్మృతి వనాన్ని  గతంలోనే నిర్మించుకున్నారు. జీవించి ఉన్నప్పుడు రామోజీరావు చేసిన సూచనల ప్రకారం.. ఆయన అంతిమ సంస్కారాలను ఇవాళ అక్కడే నిర్వహించనున్నారు.

We’re now on WhatsApp. Click to Join

రామోజీ ఫిల్మ్‌సిటీలోని స్మృతివనంలో(Ramoji Smruti Vanam) నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కె.శశాంక, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి, ఎల్బీనగర్‌ డీసీపీ ప్రవీణ్‌కుమార్, జిల్లా అదనపు కలెక్టర్‌ భూపాల్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి శనివారం రోజు పరిశీలించారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్దఎత్తున ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులను సీఎస్‌ ఆదేశించారు. అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల ఎల్‌ఈడీ తెరల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్మ్‌సిటీ ప్రతినిధులకు పోలీసులు సూచించారు.

Also Read : Ramoji Rao : కాసేపట్లో మీడియా మొఘల్ రామోజీరావు అంత్యక్రియలు

రామోజీరావుకు సంబంధించి ఉండి నియోజకవర్గం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామ కృష్ణ రాజు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా కీలక వివరాలను వెల్లడించారు. రామోజీరావు మరణించడానికి ముందే సమాధిని నిర్మించాల్సిన ప్రదేశాన్ని ఎంపిక చేసుకున్నారని ఆయన తెలిపారు. సమాధి నిర్మాణం కోసం రామోజీ ఫిల్మ్ సిటీలోనే ఓ ప్రదేశాన్ని చాలా ఏళ్ల క్రితమే రామోజీరావు ఎంపిక చేసుకున్నారని చెప్పారు. తన సమాధి ప్రాంతాన్ని ఓ ఉద్యానవనంలా మార్చాలని రామోజీరావు(Ramoji Rao) అప్పట్లోనే కుటుంబీకులకు నిర్దేశించారని రఘురామ కృష్ణ రాజు చెప్పారు. ఈమేరకు ఆయన శనివారం ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.

Also Read : Donald Duck Day : 90 ఏళ్లుగా ప్రేక్షకుల ముఖాల్లో చిరునవ్వులు నింపిన డొనాల్డ్ డక్ గురించి మీకు తెలుసా?