Site icon HashtagU Telugu

Ramoji Rao : ఇక సెలవు

Ramojifinalrites

Ramojifinalrites

ఈనాడు గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీ రావు గుండె సంబంధిత సమస్యలతో శనివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‏లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం 4.50 గంటలకు కన్నుమూశారు.

We’re now on WhatsApp. Click to Join.

రామోజీ రావు మృతి పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ సంతాపం ప్రకటించింది. ఫిల్మ్ సిటీలోని కార్పొరేట్ భవన సముదాయంలో రామోజీ రావు పార్థీవదేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్ రాజమౌళి, కీరవాణి, తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, నిర్మలా సీతారామన్ తదితరులు నివాళులర్పించారు.

రామోజీరావు అంత్యక్రియలను నేడు(ఆదివారం) తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో నిర్వహించారు. అంతకు ముందు రామోజీరావు నివాసం నుండి స్మృతివనం వరకు అంతిమ యాత్ర కొనసాగింది. ఈ యాత్రలో టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) తో పాటు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సినీ , రాజకీయ, బిజినెస్ ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబు స్వయంగా రామోజీరావు పాడె మోశారు. ఆ తర్వాత కుటుంబ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేసారు. కుమారుడు కిరణ్‌ చేతుల మీదుగా రామోజీరావు అంత్యక్రియలు జరిగాయి. రామోజీ రావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరిగాయి.

Read Also :