Site icon HashtagU Telugu

Ramoji Rao: విష‌మంగా రామోజీ గ్రూప్ చైర్మన్ రామోజీరావు ఆరోగ్య ప‌రిస్థితి..!

Ramoji Rao

Ramoji Rao

Ramoji Rao: రామోజీ గ్రూప్ చైర్మన్, మీడియా టైకూన్ చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) అస్వస్థతకు గురై హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 87 ఏళ్ల ఆయన ఆరోగ్యం క్షీణించడంతో శుక్రవారం మధ్యాహ్నం రామోజీ ఫిల్మ్ సిటీలోని తన నివాసం నుండి నానక్రామ్‌గూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కాగా ఇటీవల ఆయన గుండెకు స్టంట్ వేశారు. అయితే మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. వెంటిలేటర్ పై ఆయ‌న‌కు చికిత్స కొన‌సాగుతోంది. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధ‌ప‌డుతున్నారు ఈనాడు సంస్థ‌ల అధినేత రామోజీరావు.

Also Read: Pawan Kalyan : నిన్ను చూసి గర్విస్తున్నా సోదరా అంటూ పవన్ కళ్యాణ్ కు కమల్ హాసన్ ట్వీట్

శుక్ర‌వారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రామోజీరావు తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన‌ట్లు తెలుస్తోంది. నానక్ రామ్‌ గూడలోని స్టార్ హాస్పిటల్ కు రామోజీరావును త‌ర‌లించారు. అయితే రామోజీరావు ఆరోగ్యం విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. వయస్సు రీత్యా పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. మరికొన్ని గంటలు గడిస్తే గాని చెప్పలేం అంటున్న వైద్యులు. ఈ విష‌యం తెలిసిన అభిమానులు ఆందోళ‌న చెందుతున్నారు. వైద్యుల హెల్త్ బులెటిన్ కోసం కుటుంబ స‌భ్యులు సైతం ఎదురుచూస్తున్నారు.

We’re now on WhatsApp : Click to Join

మీడియా దిగ్గజం రామోజీరావుకు 87 ఏళ్లు పైబడి ఉండవచ్చు. కానీ తెలుగు వార్తా దినపత్రికలన్నింటిలో అత్యధిక సర్క్యులేషన్ ఉన్న మీడియా ఈనాడు యజమాని అయినందున ఆయ‌న‌కీ ఇప్పటికీ ఆంధ్ర, తెలంగాణ రాజకీయాలపై పట్టును కొనసాగిస్తున్నాడు. రామోజీ రావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సాంప్రదాయకంగా తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపుతున్నప్పటికీ.. ఆయన పాత్రికేయ విలువలు, అధికారంలో ఉన్న పార్టీతో సంబంధం లేకుండా వాస్తవాలను ప్రదర్శించడంలో అతను అనుసరించిన ధైర్యమైన వైఖరి కారణంగా ఈనాడు పాఠకులలో ఆయనకు అపారమైన గౌరవం ఉంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వంటి రాజకీయ నాయకుల నుంచి ఎన్నో అడ్డంకులు, ఒత్తిళ్లు ఎదురైనప్పటికీ రామోజీరావు ఎలాంటి యాక్ష‌న్ తీసుకోలేదు. అధికార యంత్రాంగానికి వ్యతిరేకమైనా తన పత్రికలో ఎలాంటి వివ‌క్ష చూప‌లేదు. ‘సాక్షి’ పేపర్‌తో రాజశేఖర్‌రెడ్డి రామోజీరావుపై ఎదురుదాడికి ప్రయత్నించారు. కానీ అప్పటికి ‘ఈనాడు’ సాధించిన విశ్వసనీయత కారణంగా సాక్షి విజయం సాధించలేకపోయింది.