Yadagirigutta New EO : యాదాద్రి నూతన ఈవోగా రామకృష్ణ

యాదాద్రి నూతన ఈవోగా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి (Yadagirigutta EO Geetha Reddy Resign) గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొదటి నుండి కూడా గీతారెడ్డి ప్రవర్తన ఫై భక్తులు , పలురాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజలలో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే […]

Published By: HashtagU Telugu Desk
Yadadri New Eo

Yadadri New Eo

యాదాద్రి నూతన ఈవోగా రామకృష్ణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
యాదగిరి గుట్ట ఆలయ ఈవో గీతారెడ్డి (Yadagirigutta EO Geetha Reddy Resign) గురువారం తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మొదటి నుండి కూడా గీతారెడ్డి ప్రవర్తన ఫై భక్తులు , పలురాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అప్పటి ప్రభుత్వం ఈ ఆరోపణలను ఎప్పుడూ పట్టించుకోలేదనే భావన స్థానిక ప్రజలలో నెలకొంది. అప్పటి ఎమ్మెల్యే గొంగిడి సునీత సైతం ఈవో పనితీరుపై పలుసార్లు మాజీ సీఎం కేసీఆర్ కు సైతం వివరించినట్లు సమాచారం. అయినప్పటికీ గీతారెడ్డి విషయంలో లైట్ తీసుకున్నారు. కానీ కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడం తో..గీతారెడ్డి ముందు జాగ్రత్తపడి..రాజీనామా చేసారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎండోమెంట్ కమిషనర్ ఆఫీసులో రాజీనామా లేఖను అందించారు.

We’re now on WhatsApp. Click to Join.

గీతారెడ్డి స్థానంలో ఆలయ నూతన ఈవోగా రామకృష్ణ రావు (Ramakrishna Rao) నియమితులయ్యారు. ఆ వెంటనే ఈవోగా బాధ్యతలు కూడా చేపట్టారు.గతంలో రామకృష్ణ రావు యాదాద్రి ఆలయానికి ఇన్‌చార్జ్ ఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. బాధ్యతల స్వీకరణ అనంతరం యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తన విధుల్లో బిజీ అయిపోయారు. యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 23న జరిగే వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుక నిర్వహణకోసం పూర్తి ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో రామకృష్ణ తెలిపారు. శనివారం ఆలయ ఉత్తర రాజగోపురం వద్ద ఉదయం 6:42 గంటలకు దైవ దర్శనం కల్పిస్తామని ఈవో వివరించారు. ఆ రోజు నుంచి 28వతేదీ వరకు ఆరు రోజులపాటు జరిపే అద్యయనోత్సవాల్లో వివిధ అలంకార సేవలు వైభవంగా నిర్వహిస్తామన్నారు.

Read Also : Arshdeep Singh: అర్ష్‌దీప్ సింగ్‌కు భారత్-దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ ఎందుకు చారిత్రాత్మకమైనది..?

  Last Updated: 22 Dec 2023, 12:34 PM IST