దాదాపు 500 సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత అయోధ్యలో రామమందిరం (Ayodhya Ram Temple) రూపుదిద్దుకోవడం తో యావత్ హిందువులు సంబరాలు చేసుకుంటున్నారు. అయోధ్య లో జరగబోయే ప్రాణప్రతిష్ట కార్యక్రమాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రజలంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మరికొద్ది గంటల్లో ఈ కార్యక్రమం మొదలుకాబోతుంది. ఈ తరుణంలో స్వర్ణకారులు, సూక్ష్మ కళాకారులు, నేత కార్మికులు తదితరులు తమతమ కళా నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారు. శ్రీరాముడు, సీతాదేవి, అయోధ్య రామాలయం ఇలా తమకు తోచిన నమూనాలను రూపొందిస్తూ రామయ్యపై భక్తిని చాటుకుంటూ వార్తల్లో నిలుస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నెస్ రికార్డ్ హోల్డర్, డాక్టర్ గుర్రం దయాకర్ బియ్యం గింజలతో అయోధ్య రామాలయ నమూనాను రూపొందించి వార్తల్లో నిలిచారు. 16 వేలకు పైగా బియ్యపు గింజలతో ఈ రామాలయ నమూనాను రూపొందించారు. 16 వేలకు పైగా బియ్యపు గింజలతో (16 Thousand Rice Grains) రూపొందించిన ఈ కళాఖండాన్ని ప్రధాని మోదీకి అందజేస్తా. ఈ కళాఖండాన్ని తయారు చేయడానికి 60 గంటల సమయం పట్టింది. ఇంత అద్భుతమైన కళాఖండాన్ని ఇప్పటివరకు ప్రపంచంలో ఎవరు తయారు చేయలేదు. ఈ కళాఖండాన్ని రూపొందించడం నా అదృష్టంగా భావిస్తున్నా’ అని డాక్టర్ దయాకర్ చెప్పుకొచ్చారు.
దయాకర్ బియ్యపు గింజలతో రామాలయ నమూనా రూపొందిస్తే.. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలానికి చెందిన స్వర్ణకారుడు కపిలవాయి గోపి చారి ..కేవలం 2.73 మిల్లిగ్రాముల బంగారం (2.73 gram gold)తో గోరంత సైజులో ఆయోధ్య రామాలయం నమూనాను రుపాదించి వావ్ అనిపించాడు. గోపి చారి రూపొందించిన ఈ అయోధ్య నమూనా 1.5 సెంటీ మీటర్ల ఎత్తు, 1.75 సెంటీ మీటర్ల వెడల్పు, 2.75 సెంటీ మీటర్ల పొడవుతో ఉంది. ఈయన గతంలో కూడా బంగారంతో Tట్వంటీ వరల్డ్‌కప్ నమూనాను తయారు చేశాడు. భవిష్యత్‌లో కూడా ఇలాంటి సూక్ష్మ నమూనాలను తయారు చేస్తానని చెప్పుకొచ్చారు. మొత్తం మీద రాముడి ఫై భక్తితో చాలామంది భక్తులు తమ నెపుణ్యాలను ప్రదర్శిస్తూ రామా భక్తిని చాటుకుంటున్నారు.
Read Also : Ayodhya Security: అయోధ్యలో మూడంచెల భద్రతా ఏర్పాట్లు.. గర్భగుడి బాధ్యతలు ఎవరికి ఇచ్చారంటే..?