Site icon HashtagU Telugu

Rajyasabha Selection : తుమ్మ‌ల‌కు రాజ్య‌స‌భ‌? ద‌క్షిణ తెలంగాణ‌పై కేసీఆర్ స్కెచ్ !

Rajyasabha Selection

Rajyasabha Selection

అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈసారి రాజ్య‌స‌భ (Rajyasabha Selection)ఎంపిక ఉంటుంద‌ని గులాబీశ్రేణుల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. దక్షిణ తెలంగాణ వ్యాప్తంగా బ‌ల‌హీనంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీని బ‌లోపేతం చేసుకోవ‌డానికి కేసీఆర్ ఎత్తుగ‌డ వేస్తున్నారు. ఆ కోణం నుంచి ప‌రిశీలిస్తే, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావుకు రాజ్య‌స‌భ ఇవ్వ‌డం ద్వారా ఖ‌మ్మం రాజ‌కీయాన్ని సానుకూలంగా మ‌లుచుకోవ‌చ్చ‌ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ భావిస్తున్నార‌ట‌. జాతీయ రాజ‌కీయాల కోణం నుంచి చూస్తే మాత్రం క‌విత‌కు అవ‌కాశం ఇస్తార‌ని చెబుతున్నారు. అయితే, నిజామాబాద్ లోక్ స‌భ నుంచి గెలిచే అభ్య‌ర్థిగా క‌విత ఉన్నారు. సుదీర్ఘ‌కాలం పాటు రాజ్య‌స‌భ‌ను అనుభ‌విస్తోన్న కేశ‌వ‌రావును ఈసారి ప‌క్క‌న పెడ‌తార‌ని టాక్‌.

అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని ఈసారి రాజ్య‌స‌భ ఎంపిక(Rajyasabha Selection)

తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ సీట్ల కోసం అధికార టీఆర్ఎస్ లో పోటాపోటీ నెలకొంది. షెడ్యూల్ ప్రకారం రాజ్యసభ (Rajyasabha Selection)ద్వైవార్షిక ఎన్నికల నోటిఫికేషన్ మార్చి 6న జారీ కానుంది. 13వ తేదీ వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. సామాజిక కోణంలో తమకు అవకాశం దక్కుతుందని పలువురు సీనియర్లు భావిస్తుండగా ఇప్పటివరకు పార్టీ తరఫున రాజ్యసభ పదవులు దక్కని వర్గాల వారూ ఆశగా ఎదురుచూస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.

మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని

నిజామాబాద్ మాజీ ఎంపీ కవితను ఈసారి పార్టీ తరఫున రాజ్యసభకు (Rajyasabha Selection) పంపిస్తారనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది. అయితే సి.ఎం కేసీఆర్ ఆలోచనే ఎలా వుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. కెటిఆర్ సి.ఎం అవుతారా? కవితా రాజ్యసభకు వెళ్తారా? అయితే, హరిష్ రావు ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారు? అనే అంశంపై టిఆర్ ఎస్ కార్యకర్తల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలనుకుంటున్న సీఎం కేసీఆర్ తన త‌ర‌పున‌ ఢిల్లీ, ఇతర రాష్ట్రాల్లో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు ప్రయత్నాలకు నమ్మకమైన వారి కోసం అన్వేషిస్తున్నారు. రాజ్యసభ సీటు భర్తీ సామాజిక కోణంలోనే ఉంటుందని టీఆర్ఎస్ ముఖ్యులు భావిస్తున్నారు.

Also Read : KCR Powder : BRS,BJP సూత్రం ఇంచుమించు ఒక‌టే..!

ఏపీ కోటాలో పదవీ విరమణ చేస్తున్న టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు(Rajyasabha Selection) కె.కేశవరావుకు వయసు రీత్యా ఈసారి అవకాశం ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే మండవ వెంకటేశ్వరావు, తుమ్మల నాగేశ్వరరావు పేర్లు పరిశీలించవచ్చని అంటున్నారు. బీసీలకు అవకాశం ఇస్తే సిరికొండ మధుసూదనాచారి, బస్వరాజు సారయ్య పేర్లు పరిశీలిస్తారని చెబుతున్నారు. ఎస్సీ కోటాలో భర్తీ చేయాలని భావిస్తే కడియం శ్రీహరి, మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్లు పరిశీలిస్తారని టాక్. ఎస్సీల్లోనే మాలలకు అవకాశం ఇవ్వాలని అనుకుంటే, టీఎస్ఐఐ సి చైర్మన్ గాదరి బాలమల్లు, ఎస్టీ అయితే సీతారాంనాయక్ పేరు ఉండొచ్చని భావిస్తున్నారు. అనూహ్యంగా ఒక పారిశ్రామికవేత్తను టీఆర్ఎస్ తరఫున రాజ్యసభకు పంపాలనుకుంటే హెటిరో అధినేత పార్థసారథిరెడ్డి పేరు పరిశీలించవచ్చని చెబుతున్నారు.

Also Read : BRS vs Congress : బుద్వేల్ భూముల వేలంపై కాంగ్రెస్ ఆగ్ర‌హం.. భూములు కొన్న‌వారంతా…?