Site icon HashtagU Telugu

Rajya Sabha Elections: తెలంగాణ నుంచి రాజ్యసభకు ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవం

Rajya Sabha elections

Rajya Sabha elections

Rajya Sabha Elections: రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. తెలంగాణ రాష్ట్రంలోని 3 స్థానాలకు ముగ్గురు అభ్యర్థులు మాత్రమే మిగిలిపోవడంతో ఎన్నిక ఏకగ్రీవమైంది .

కాంగ్రెస్ నుంచి రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి వావిరాజు రవిచంద్ర ఏకగ్రీవమయ్యారు. శ్రమజీవి పార్టీ తరపున జాజుల భాస్కర్, భోజరాజు కోయల్కర్, స్వతంత్ర అభ్యర్థిగా కిరణ్ రాథోడ్ నామినేషన్లు దాఖలు చేశారు, రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటున్న ప్రతి అభ్యర్థికి మద్దతుగా కనీసం 10 మంది ఎమ్మెల్యేలు సంతకం చేయాలి. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థులు మినహా మిగిలిన ముగ్గురు అభ్యర్థులకు మద్దతుగా ఎమ్మెల్యేలు ఎవరూ సంతకం చేయలేదు. వీరి నామినేషన్లను రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తిరస్కరించారు.

కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెస్‌ తరుపున ఇద్దరు , ఒక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటిస్తారు.

Also Read: Babool Plant: అతిసారం నుంచి ఉప‌శ‌మ‌నం పొందండిలా..!