Site icon HashtagU Telugu

Rajasthan CM : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో రాజస్థాన్ సీఎం

Ashok Gehlots Big Claim

Ashok Gehlots Big Claim

Rajasthan CM : తెలంగాణలో ఎన్నికలకు ఇంకా ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఎన్నికల ప్రచారానికి కూడా ఈరోజుతో తెర పడనుంది. ఈరోజే ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. రేపు ఎన్నికల ప్రచారం చేయడానికి వీలు లేదు. ఎల్లుండి నవంబర్ 30న తెలంగాణ వ్యాప్తంగా అంతటా 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈనేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇవాళ ప్రచారానికి ఒక్కరోజే సమయం ఉండటంతో జాతీయ పార్టీలు జాతీయ స్థాయి నేతలను తీసుకొచ్చి మరీ ప్రచారం చేయిస్తున్నాయి.

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి నాయకులతో తెలగాణలో ఎన్నికల ప్రచారం చేయిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ జాతీయ నాయకులు చాలామంది తెలంగాణలోనే మకాం వేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే దగ్గర్నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర నేతలు ఇక్కడే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తాజాగా రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లట్ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా హైదరాబాద్ కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ… బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

రెండు పార్టీలు రాజకీయాలు చేసి అధికారంలోకి వచ్చాయి. ప్రధాని మోదీ రాజస్థాన్ లో పేపర్ లీక్ జరుగుతుంది అని అంటున్నారు. పేపర్ లీక్స్ రాజస్థాన్ లోనే కాదు.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణ.. ఇలా అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది. ఒక్క రాజస్థాన్ నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మీ సొంత రాష్ట్రం గుజరాత్ కూడా పేపర్ లీకేజీలకు పెట్టింది పేరు కదా.. అంటూ ప్రధాని మోదీని అశోక్ ప్రశ్నించారు

Exit mobile version