Raja Singh Case: రాజాసింగ్ పీడీ యాక్ట్ కేసు విచారణ నేడు!

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు విచారణ గురువారం జరగనుంది. రాజా సింగ్ ఆగస్టు 25 నుంచి జైలులో ఉన్నాడు.

  • Written By:
  • Publish Date - September 29, 2022 / 06:45 AM IST

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కేసు విచారణ గురువారం జరగనుంది. రాజా సింగ్ ఆగస్టు 25 నుంచి జైలులో ఉన్నాడు. పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రాజాసింగ్‌ను అరెస్ట్ చేశారు. రాజా సింగ్ కేసును పీడీ అడ్వైజరీ బోర్డు కమిటీ రేపు విచారించనుంది. రాజాసింగ్‌ను జైలు నుంచి విడిపించేందుకు ఇప్పటికే అనేక ప్రయత్నాలు జరిగాయి. రాజాసింగ్ భార్య ఉషాబాయి స్వయంగా రంగంలోకి దిగి గవర్నర్ ను కలిశారు. తన భర్త ప్రాణాలకు ముప్పు ఉందని అనుమానించింది. అదే విధంగా హైకోర్టును కూడా ఆశ్రయించారు. భర్తను జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నించారు.

రాజాసింగ్‌పై 2004 నుంచి ఇప్పటి వరకు 100కు పైగా కేసులు నమోదు కాగా, పీడీ యాక్ట్‌ కేసు నమోదు చేసి జైలుకు పంపారు. ప్రముఖ స్టాండప్ కమెడియన్ మునవర్ ఫారూఖీ షో హైదరాబాద్‌లో జరిగింది. ఆ షో జరగకుండా రాజాసింగ్ తీవ్రంగా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మునవర్ హైదరాబాద్ లో అడుగు పెట్టనివ్వవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం మునవర్ షోకు అనుమతి ఇచ్చింది. కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య ప్రదర్శన జరిగింది.

మునవర్ జో ఘటనను నిరసిస్తూ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేయబడింది. ఆ వీడియోలో రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో వెంటనే ఆ వీడియోను తొలగించారు. రాజా సింగ్‌ను అరెస్టు చేశారు.