Site icon HashtagU Telugu

Hero Rajasekhar : జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలికు హీరో రాజశేఖర్ పిర్యాదు..

Rajasekhar Amrapali

Rajasekhar Amrapali

జీహెచ్ఎంసీ కమిషనర్‌ గా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి ఆమ్రపాలి (GHMC Commissioner Amrapali) తన మార్క్ కనపరుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తన ఏ శాఖలో పనిచేసిన ఆ శాఖకు పూర్తి న్యాయం చేస్తుంటుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఆమె కావాలని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమెకు బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్ లో నిత్యం GHMC సమస్యలు వెంటాడుతూనే ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్షాకాలం వచ్చిందంటే చాలు డ్రైనేజ్ సమస్యలు అధికారులను ముప్పతిప్పలు పెడుతుంటాయి. మాములుగా చిన్న చినుకు పడితేనే.. రోడ్లు చెరువులవుతాయి. ఇక.. ఎడతెరపి లేకుండా వర్షాలు పడితే.. నాలాలు ఉప్పొంగి.. ఇళ్లను ముంచేస్తాయి. ఇది ప్రతిసారి జరిగేదే. ఇక వరద ప్రవాహానికి నాలాల్లో ఉన్న చెత్తాచెదారం, మిగతా వ్యర్దాలన్నీ కూడా రోడ్లపైకి వచ్చి మనుషులను నడవకుండా..నిల్చుకుండా చేస్తాయి.

We’re now on WhatsApp. Click to Join.

తాజాగా హీరో రాజశేఖర్ (Hero Rajasekhar) ఇంటి వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. గత కొద్దీ రోజులుగా నాలాలో నుండి డ్రైనేజ్ వాటర్ బయటకు వస్తూ తీవ్ర ఇబ్బందికి గురి చేస్తుందట. ఈ విషయాన్నీ ఎన్నో సార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడం తో..నేరుగా జీహెచ్ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలికి పిర్యాదు చేసాడు. “జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌- 70 లోని అశ్విని హైట్స్‌లో డ్రైనేజీ లీక్‌ సమస్య చాలా రోజులుగా ఇబ్బంది పెడుతోంది. ఈ లీకేజీ సమస్య గురించి చాలా సార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు తీసుకోవడం లేదు. సమస్యకు సత్వర పరిష్కారం చూపించండి.” అని కోరుతూ రాజశేఖర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు ఆ లీక్ అవుతున్న మ్యాన్ హోల్ ఫొటోను కూడా జత చేశారు. మరి ఈ సమస్యను ఆమ్రపాలి పరిష్కరిస్తుందో లేదో చూడాలి.

Read Also : Academic Calendar 2024-25 : ఏపీలో దసరా, సంక్రాంతి సెలవులు ఎన్ని రోజులంటే..!!