Rajalingamurthy Murder Case: రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో బీఆర్ఎస్ నేత.. మర్డర్‌కు కారణమిదీ

రాజలింగమూర్తికి(Rajalingamurthy Murder Case) సంజీవ్‌కు మధ్య గత కొంతకాలంగా ఎకరం స్థలం విషయంలో భూవివాదం నడుస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Rajalingamurthy Murder Case Brs Leader

Rajalingamurthy Murder Case: భూపాలపల్లి జిల్లాలో సామాజిక కార్యకర్త నాగవెల్లి రాజలింగమూర్తి హత్యతో తెలంగాణలో రాజకీయంగా కలకలం రేగింది. ఈవిషయంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పరస్పర విమర్శలు చేసుకున్నాయి.  కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్, హరీశ్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ రాజలింగమూర్తి గతంలో కేసు వేశారు. అందుకే ఆయన హత్య రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది.  ఈ కేసు మిస్టరీ వీడింది. భూవివాదం వల్లే రాజలింగమూర్తి హత్య జరిగిందని పోలీసులు తేల్చారు. పక్కా ప్లాన్‌ ప్రకారమే ఈ హత్య జరిగిందని వెల్లడించారు. ఈ హత్యతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న  ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో ఒక బీఆర్‌ఎస్‌ నేత కూడా ఉండటం గమనార్హం. ఈమేరకు వివరాలను ఎస్పీ కిరణ్‌ ఖరే మీడియాకు వెల్లడించారు.

Also Read :SLBC Incident: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్.. రేవంత్‌కు రాహుల్ ఫోన్‌కాల్

ఎకరం స్థలం విషయంలో భూవివాదం

రాజలింగమూర్తికి(Rajalingamurthy Murder Case) సంజీవ్‌కు మధ్య గత కొంతకాలంగా ఎకరం స్థలం విషయంలో భూవివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే రాజలింగమూర్తిని హత్య చేయాలని సంజీవ్ ప్లాన్ వేశాడు. ఇందుకోసం వరంగల్‌లోని కాశీబుగ్గలో కత్తులు, రాడ్లను కొన్నాడు. రాజలింగమూర్తి కంట్లో కారం కొట్టి, కత్తులతో పొడిచి చంపారు.  ఈ హత్యలో మొత్తం 10 మంది పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏ1 నిందితుడు రేణిగుంట్ల సంజీవ్, ఏ4 నిందితుడు, మరో ఇద్దరు వ్యక్తులు ఈ హత్యలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మిగతా వాళ్లు వాళ్లతో టచ్‌లో ఉన్నారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read :Gold Rate : 50 రోజుల్లోనే రూ.9500 పెరిగిన బంగారం రేటు.. ఎందుకు ?

కీలకంగా హరిబాబు కాల్ డేటా  

ఈ కేసులో నిందితులుగా భావిస్తున్న ఐదుగురితో పాటు బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మున్సిపల్ వైస్‌ ఛైర్మన్  కొత్త హరిబాబు పాత్రపై పోలీసులు దృష్టిసారించారు. హత్య జరిగిన తర్వాత నమోదైన కాల్‌ డేటా రికార్డ్‌(సీడీఆర్‌)ను విశ్లేషిస్తున్నారు. రాజలింగమూర్తి హత్య జరిగినప్పటి నుంచి హరిబాబు పరారీలో ఉండడం అనుమానాలను తావిస్తోంది. ఫిబ్రవరి 19న(బుధవారం) సాయంత్రం 7.15 గంటలకు మర్డర్ జరగగా,  ఆ టైంలో నిందితుల్లో ఒకరైన రేణిగుంట్ల సంజీవ్‌(ఏ1) హరిబాబుకు ఫోన్ కాల్ చేసినట్లు గుర్తించారు. ఆ రోజు హరిబాబుతో మాట్లాడిన వాళ్లందరినీ పిలిపించి పోలీసులు విచారించారు. ఈవిధంగా భూపాలపల్లి పట్టణానికి చెందిన ఇద్దరు రేషన్‌ డీలర్లు, ఒక వీఆర్‌ఏ, గణపురం మండలం చెల్పూరుకు చెందిన ఒక రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి పేర్లు బయటికి వచ్చాయి. హరిబాబుకు సన్నిహితులైన ఖాశీంపల్లికి చెందిన ఇద్దరు ప్రధాన అనుచరులను కూడా పోలీసులు ఇంటరాగేట్ చేస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి గతంలో పీసీసీ చీఫ్‌ హోదాలో జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు ఆయనపై రాళ్లు, కోడిగుడ్లతో దాడి జరిగింది. ఆ కేసులో హరిబాబు ప్రధాన నిందితుడు. రాజలింగమూర్తి హత్యకేసులోనూ హరిబాబు పేరే వినిపిస్తోంది.

  Last Updated: 23 Feb 2025, 12:14 PM IST