TS Assembly : కేటీఆర్ కు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన రాజగోపాల్

  • Written By:
  • Updated On - February 8, 2024 / 03:04 PM IST

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో (TS Assembly Session) ఆసక్తికర చర్చ నడిచింది..అది కూడా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) కి , బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ (KTR) కు మధ్య.. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందని రాజగోపాల్ ను.. KTR అడగగా.. తనకూ KCR లాగే ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతోందని సమాధానం ఇచ్చారు. కానీ నాకు హోమ్ మంత్రి పదవి ఇస్తే బాగుండని కోరుకుంటున్నట్లు తన మనసులోని మాటను బయటకు తెలిపారు రాజగోపాల్.

తానూ హోంమంత్రి అయితేనే బీఆర్ఎస్ వాళ్ళు కంట్రోల్‌లో ఉంటారని..వాళ్లను జైలుకు పంపడమే తన కోరిక అని చెప్పుకొచ్చారు. కేసీఆరే దగ్గరుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలోకి పంపుతారని ఆరోపించారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయడం ఖాయం అని , కేసీఆర్‌కు ఇప్పుడు బీజేపీనే శ్రీరామరక్ష అని చెప్పుకొచ్చారు. కల్వకుంట్ల కుటుంబం జైలుకెళ్ళడం ఖాయమని , భువనగిరి, నల్గొండ పార్లమెంట్‌కు కుటుంబ సభ్యులెవ్వరు పోటీ చేయకూడదు అనేది మా ఉద్దేశ్యం అన్నారు. పార్టీ ఆదేశిస్తే మాత్రమే పోటీ చేస్తామన్నారు. లేదంటే ఎవరికి టిక్కెట్ ఇచ్చినా గెలిపిస్తామన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇదిలా ఉంటె..మొదటి రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కొంత ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే గత పదేళ్లుగా పాలన చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. అసెంబ్లీలో పార్టీ రంగు అయిన ‘గులాబీ కలర్‌’.. అసెంబ్లీలో దాదాపు ప్రతి పేపర్‌పై ఉండేది. సమావేశాల సమయంలో మీడియాకు ఇచ్చే అసెంబ్లీ పాస్‌ల నుంచి అసెంబ్లీలో సభ్యులకు ఇచ్చే పేపర్ల వరకు గులాబీ రంగులో ఉండేవి. దీంతో గులాబీ రంగును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలోనే ‘గులాబీ’ రంగును తీసేయండి.. అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేశారు. గులాబీ రంగుల్లో ఉన్న పాస్‌లకు వేర్వేరు రంగుల్లో ఇవ్వాలని సూచించారు.

Read Also : Kodi Kathi Case : ఐదేళ్ల తర్వాత కోడికత్తి శ్రీనివాస్ కు బెయిల్ లభించింది

Follow us