Raja Singh Bullet Bike: తగ్గేదేలే.. బుల్లెట్ బండిపై అసెంబ్లీకి రాజాసింగ్!

రాజాసింగ్ (Raja Singh) బుల్లెట్ బండిపై రయ్ రయ్ అంటూ దూసుకుపోయారు.

Published By: HashtagU Telugu Desk
Rajasingh

Rajasingh

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. అయితే గత కొంతకాలంగా ఆయన బుల్లెట్ ఫ్రూప్ కారు తరుచుగా మొరాయిస్తుండటం, ఎక్కడపడితే అక్కడే ఆగిపోతుండటం ఆయనకు కోపాన్ని తెప్పించింది. ఈ నేపథ్యంలో తనకు కొత్త బుల్లెట్ ఫ్రూప్ వెహికల్ కావాలని డిమాండ్ చేశారు. అయితే ప్రభుత్వం (TS Govt) స్పందించకపోవడంతో ఏకంగా ప్రగతి భవన్ వద్ద నిరసనకు దిగారు. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో రాజాసింగ్ (Raja Singh) బుల్లెట్ బండిపై రయ్ రయ్ అంటూ దూసుకుపోతున్నారు.

ఇక తాజాగా శనివారం ఉదయం.. రాజాసింగ్.. వినూత్న నిరసనకు దిగారు. అసెంబ్లీకి ఆయన బుల్లెట్ పై వచ్చారు. హెల్మెట్ పెట్టుకుని.. బుల్లెట్  (Bullet Bike)పై వచ్చిన ఆయనను తొలుత పోలీసులు గుర్తించలేదు. దీంతో తనకు అసెంబ్లీ ఇచ్చిన గుర్తింపు కార్డును చూపించారు. దీంతో పోలీసులు అసెంబ్లీ లోపలికి వదలడంతో గేట్ నంబర్ 2 నుంచి లోపలికి వెళ్లారు. ఈ ఘటనను చూసిన.. పలువురు ఎమ్మెల్యేలు.. ఆయన వద్దకు వచ్చి.. సెల్ఫీలు దిగారు. అయితే.. రాజాసింగ్ (Raja Singh) మాత్రం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇప్పటికైనా తనకు కారు కేటాయించాలని కోరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Also Read: Assembly Session: చేపల ఉత్పత్తిలో తెలంగాణ ఫస్ట్

  Last Updated: 11 Feb 2023, 04:19 PM IST