Raja Singh : బీజేపీ టికెట్ ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా.. సెక్యులర్ పార్టీలలోకి వెళ్ళను..

ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం మీడియా ముందుకు వచ్చి నేనే మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తాను. సస్పెన్షన్ ఎత్తేస్తారు అని మాట్లాడుతున్నారు.

Published By: HashtagU Telugu Desk
Raja Singh spoke with Media about Contesting in Goshamahal From BJP

Raja Singh spoke with Media about Contesting in Goshamahal From BJP

ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) ని బీజేపీ(BJP) పార్టీ క్రమశిక్షణ చర్యల నేపథ్యంలో సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం గోషామహల్(Goshamahal) ఎమ్మెల్యేగా రాజాసింగ్ ఉన్నారు. ఇప్పటికే రాజాసింగ్ బీజేపీ నుంచి రెండు సార్లు ఈ నియోజకవర్గంలో గెలిచారు. రాజాసింగ్ ని సస్పెండ్ చేయడంతో ఈ సారి గోషామహల్ టికెట్ ఎవరికి ఇస్తారు అని చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ టికెట్ రేసులో మాజీ మంత్రి ముకేశ్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ కూడా ఉన్నారు.

కానీ ఇటీవల ఎమ్మెల్యే రాజాసింగ్ మాత్రం మీడియా ముందుకు వచ్చి నేనే మళ్ళీ బీజేపీ నుంచి పోటీ చేస్తాను. సస్పెన్షన్ ఎత్తేస్తారు అని మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు మాత్రం రాజాసింగ్ సస్పెన్షన్ కేంద్రం చూసుకుంటుందని అంటున్నారు. తాజాగా మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియా ముందుకి వచ్చారు.

ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. నేను సచ్చినా సెక్యులర్ పార్టీలకు మాత్రం వెళ్ళను. నా ప్రాణం పోయినా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు పోను. బీజేపీ నాకు టికెట్ ఇవ్వకుంటే రాజకీయాలు పక్కన పెట్టి నేను హిందూ రాష్ట్రం కోసం పని చేసుకుంటాను. గోషామహల్ బీఆర్ఎస్ టికెట్ ఎంఐఎం చేతిలో ఉంది. అందుకే పెండింగ్ పెట్టారు. దారుసలామ్ నుంచి గోషామహల్ బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంపిక చేస్తారు. బీజేపీ టికెట్ ఇవ్వకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను. అంతేకాని ఇండిపెండెంట్ గా కానీ వేరే పార్టీల నుంచి కానీ పోటీ చేయను. బీజేపీ అధిష్టానం నాపై సానుకూలంగా ఉంది. సరైన సమయం చూసి నాపై సస్పెన్షన్ వేటు ఎత్తివేస్తారు అని తెలిపారు. మరి ఈసారి గోషామహల్ లో బీజేపీ నుంచి ఎవరు నిలబడతారో చూడాలి.

 

Also Read : BRS Graph: బీఆర్ఎస్ గ్రాఫ్ ఢమాల్, కేసీఆర్ నాయకత్వంపై వ్యతిరేకత?

  Last Updated: 29 Aug 2023, 07:40 PM IST