Site icon HashtagU Telugu

Raja Singh : గోషామహాల్ బీజేపీ అభ్యర్థి నేనే.. రాజాసింగ్..

Raja Singh said he will contest again in Goshamahal from BJP

Raja Singh said he will contest again in Goshamahal from BJP

తెలంగాణ(Telangana)లో ఎలక్షన్స్(Elections) హడావుడి అప్పుడే మొదలైంది. బీఆర్ఎస్(BRS) నేడు ఒకేసారి రాబోయే ఎన్నికల్లో నిలబడే తమ అభ్యర్థుల్ని ప్రకటించి ప్రతిపక్షాలకు ఝలక్ ఇచ్చింది. అయితే ఒక 7 స్థానాల్లో మాత్రం ఇంకా అభర్ధులని ఫైనల్ చేయలేదు. అందులో గోషామహల్(Goshamahal) కూడా ఒకటి. ప్రస్తుతం గోషామహల్ ఎమ్మెల్యేగా రాజాసింగ్(Raja Singh) ఉన్నారు. బీజేపీ(BJP) నుంచి గెలిచినా ఈయన్ని తర్వాత పార్టీ సస్పెండ్ చేసింది.

రాజాసింగ్ అక్కడి నుంచి రెండు సార్లు గెలవడంతో రాబోయే ఎన్నికల్లో గోషామహల్ లో బీజేపీ ఎవరికి టికెట్ ఇస్తుందని అందరూ ఎదురుచూస్తున్నారు. తాజాగా గోషామహల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా ప్రకటించకపోవడంతో రాజాసింగ్ మీడియా ముందుకు వచ్చి ఈ సారి కూడా బీజేపీ నుంచి నేనే పోటీ చేస్తానని ప్రకటించడం గమనార్హం.

రాజాసింగ్ నేడు మీడియాతో మాట్లాడుతూ.. గోషామహాల్ లో బీజేపీ అభ్యర్థిగా ఈసారి కూడా పోటీచేసేది నేనే. గెలిచేది నేనే. బీఆర్ఎస్ తో మరో యుద్దానికి సిద్ధం కావాలి. బీజేపీ హైకమాండ్ తో పాటు.. నాకు బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ల మద్దతుంది. గోషామహాల్ లో బీఆర్ఎస్ అభ్యర్థిని ఎంఐఎం పార్టీ డిసైడ్ చేస్తోంది. అందుకే ఇంకా ప్రకటించలేదు. 2108లో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రేమ్ సింగ్ రాథోడ్ ను ఎంఐఎం పెట్టింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అని అన్నారు. మరి బీజేపీ నిజంగానే సస్పెన్షన్ ఎత్తివేసి గోషామహల్ టికెట్ రాజాసింగ్ కి ఇస్తుందా చూడాలి.

 

Also Read : Telangana Elections : టికెట్ దక్కని నేతలకు తీపి కబురు తెలిపిన కేటీఆర్