Raja Singh : హైదరాబాద్ గోషామహల్ నియోజకవర్గానికి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన టీ. రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన నేపథ్యంలో, పార్టీ దీనిని అంగీకరించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్వయంగా ఈ రాజీనామాపై నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పార్టీ కార్యాలయ వర్గాల ప్రకారం, కేంద్ర నాయకత్వం రాజాసింగ్ నిర్ణయాన్ని సమీక్షించి, ఆమోదించినట్టు తెలుస్తోంది.
రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవిలో రాంచందర్‌రావుకు పగ్గాలు అప్పగించడం పట్ల రాజాసింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా అధ్యక్ష పదవికి నామినేషన్ వేయాలని అనుకున్నా, తన మద్దతుదారులను బెదిరించడం, నామినేషన్ వేయనివ్వకపోవడం తనకు బాధ కలిగించిందని చెప్పారు. “వాళ్లు అనుకున్న వాళ్లకే పదవులు ఇచ్చారు. అందుకే ఈ పార్టీని వీడుతున్నాను. రాష్ట్ర అధ్యక్షుడికి రాజీనామా లేఖ ఇవ్వడానికే పార్టీ కార్యాలయానికి వచ్చాను,” అని తెలిపారు.
Shubman Gill: టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుభమన్ గిల్?
“తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని ఎంతో పోరాడాం. కానీ, అధిక నేతలు అది జరగకూడదని చూస్తున్నారు. నేను, నా కుటుంబం టెర్రరిస్టుల టార్గెట్‌లో ఉన్నాం. అయినా బీజేపీ కోసం సమర్పణగా పనిచేశాను. కానీ ప్రతిఫలం శూన్యం. అందుకే ఈ పార్టీకి ‘లవ్ లెటర్’ (రాజీనామా లేఖ) ఇచ్చి వెళ్తున్నా. మీకూ, మీ పార్టీకూ దండం,” అని రాజాసింగ్ ఆవేదనతో వ్యాఖ్యానించారు.
బీజేపీకి రాజీనామా చేసినా, తన హిందుత్వ పోరాటం మాత్రం ఆగదని స్పష్టం చేశారు. “ఈ రాజీనామా లక్షల మంది కార్యకర్తల బాధను ప్రతిబింబిస్తుంది,” అని చెప్పిన ఆయన, పార్టీ నుంచి బయటకు వచ్చినా ప్రజలకు చేరువగా ఉంటానని, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నం కొనసాగుతుందని తెలిపారు.
ఇక రాజాసింగ్ బీజేపీ సింబల్‌పై గెలిచిన ఎమ్మెల్యే కావడంతో, ప్రస్తుతం ఆయన అనర్హుడని భావించాలా? లేదా స్వతంత్రంగా కొనసాగించాలా? అనే చర్చ కూడా మొదలైంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పీకర్‌ను ఆశ్రయించి రాజాసింగ్‌ను సస్పెండ్ చేయాలని కోరాల్సిందిగా పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని సమాచారం.
Tennis Player: టెన్నిస్ ప్లేయర్ హత్య.. వెలుగులోకి సంచలన విషయాలు!