Raja Singh : మరోసారి బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత ఔరంగజేబ్, బాబర్ వారసులు ఆందోళనకు గురవుతున్నారని ఎద్దేవా చేశారు.
Read Also: Chhattisgarh : 50 మంది మావోయిస్టులు లొంగుబాటు
కాగా, ఇటీవల మహారాష్ట్రలోని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు సమాధిని కూల్చివేయాలంటూ డిమాండ్లు కొనసాగాయి. మహారాష్ట్రలోని శంభాజీనగర్ జిల్లా ఖుల్దాబాద్‌లో ఉన్న సమాధి వద్దకు వెళ్లే సందర్శకులపై ఆంక్షలు విధించింది. ఆ ప్రాంతంలో పోలీస్ భద్రతను కట్టుదిట్టం చేసింది. అంతేకాకుండా ఈ ఘర్షణల్లో కొందరు వ్యక్తులు విధుల్లో ఉన్న మహిళా పోలీసు అధికారితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదైంది. నాగ్‌పుర్ అల్లర్ల సూత్రధారిగా అనుమానిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నించారు. కొందరు ఉద్రిక్తతలను మరింత రెచ్చగొట్టేలా నినాదాలు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను చూస్తే అవగతం అవుతోంది.
ఇకపోతే.. పోలీసులు గత ఏడాది శ్రీరామనవమి శోభాయాత్రకు అనుమతి నిరాకరించారని, ఎంఐఎం ఆదేశంతోనే అనుమతి రద్దు చేశారని ఆరోపించారు. ఈసారి అనుమతి కోసం దరఖాస్తు కూడా వేయలేదని తెలిపారు. అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం పూర్తయిన తర్వాత, ఔరంగజేబు, బాబర్ వారసులు పరేషాన్ అవుతున్నారని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
Read Also: Important Festivals: కొత్త ఏడాది ఉగాది నుంచి ముఖ్యమైన పండగలు ఇవీ!